ప్రజల నీరాజనం మధ్యన రమణన్న ప్రజాశీర్వాద యాత్ర
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందంజలో నిలవాలంటే కేసీఆర్ ప్రభుత్వం రావాలి,భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే కారు గుర్తుపై ఓటువేసి గండ్ర వెంకట రమణా రెడ్డిని గెలిపించాలని మాజీ స్పీకర్,ఎమ్మెల్సీ మధుసూదన చారి కోరారు.
ఈ రోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలోని 16వ,17వ, 29వ వార్డు సుభాష్ కాలనీ లో ప్రజల నీరాజనం మధ్య,మహిళల,కార్యకర్తల కోలాహలం మధ్యన ఘనంగా సాగింది.
నాడు చిన్న కుగ్రామం అయిన భూపాలపల్లి నేడు వరంగల్, హన్మకొండ జిల్లాలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమంలో పోటీ పడుతున్న జిల్లా మన భూపాలపల్లి జిల్లా…
నాడు భూపాలపల్లి పట్టణం కేంద్రంలో బస్ డిపో, డిగ్రీ,జూనియర్ కళాశాలలు, సింగరేణి కార్మికుల కొరకు కు క్వార్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది…
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 350 పడకల ఆసుపత్రి,మెడికల్ కాలేజ్,30 పడకల ఆయుష్ హాస్పిటల్ ,భూపాలపల్లి బైపాస్ రోడ్డు, మిషన్ భగీరథ మంచి నీరు దాదాపు 100 కోట్ల రూపాయలతో భూపాలపల్లి పట్టణంలోని అన్ని వార్డులో సీసీ రోడ్లు,సైడ్ డ్రైన్ లు మరియు సుభాష్ కాలనీలో మురుగునీటితో ఎప్పుడు కంపు కొట్టే స్థలాన్ని దాదాపు 4 కోట్ల రూపాయలతో అందరికీ ఉపయోగపడే విధంగా అద్భుతమైన ఇండోర్ స్టేడియం నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయడం జరిగింది…
70 కోట్ల రూపాయలతో చేల్పుర్ నుండి బాంబుల గడ్డ వరకు రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నాం…
ఆదరణ నోచుకోని రామాలయాన్ని దాదాపు 25 లక్షల రూపాయలతో అభివృద్ది చేసుకోవడం జరిగింది…
సుభాష్ కాలనీ లో సింగరేణికి కేటాయించిన స్థలంలో స్థిరనివాసం ఏర్పరచుకొని జీవిస్తున్న వారికి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రత్యేకమైన జి ఓ 76 తీసుకొచ్చి వారికి రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేయించి పట్టాలు ఇవ్వడం జరిగింది.
ఇంకా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది.
భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే బి ఆర్ ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలో కి రావాలి, కేసిఆర్ గారు ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అని, భూపాలపల్లి ఎమ్మెల్యేగా కారు గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో ఆశీర్వదించి,గెలిపించాలని ప్రజలను కార్యకర్తలను కోరారు…
అనంతరం కాంగ్రెస్, బీజేపీ పార్టీ నుండి చెల్పూర్ గ్రామ పంచాయతీ దుబ్బపల్లి గ్రామం మరియు భూపాలపల్లి పట్టణ సుభాష్ కాలనీ కి చెందిన దాదాపు 50 మంది కార్యకర్తలు భారత రాష్ట్ర సమితి పార్టీ లో చేరారు