
e69 news telugu news local news
తపన్ సేన్
ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలో నిరుద్యోగం, పేదరికం ఒకవైపున పెరుగుతుంటే మరొకవైపున ప్రజాధనాన్ని కార్పొరేట్లకు ప్రభుత్వం ధారా దత్తం చేస్తున్నది. ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలో నిరుద్యోగం, పేదరికం ఒకవైపున పెరుగుతుంటే మరొకవైపున ప్రజాధనాన్ని కార్పొరేట్లకు ప్రభుత్వం ధారా దత్తం చేస్తున్నదని సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ అన్నారు. సిఐటియు ఆల్ ఇండియ వర్కింగ్ కమిటీ సమవేశాలు హన్మకొండలో జరగుతున్నాయి. వాస్తవానికి భిన్నంగా ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయని ఓదరగొడుతున్నారు నూతనంగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం పేరున లక్షన్నర కోట్ల రూపాయలు స్వదేశీ విదేశీ గుత్త సంస్థలకు కట్టబెడుతున్నారన్నారు. అయినప్పటికీ కొత్తగా ఉద్యోగ అవకాశాలు పెరగకపోగా నిరుద్యోగం గణనీయంగా పెరిగింది ప్రభుత్వ ఈ విధానాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు ప్రజలు వివిధ రూపాలలో ఆందోళనలు చేస్తున్నారు ఇటీవల కాలంలో జరిగిన పోరాటాలు ఎందుకు నిదర్శనం హర్యానాలో 75 రోజుల ఆశా కార్యకర్తల సమ్మె ఆంధ్రప్రదేశ్ లో 42 రోజుల అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె రవాణా రంగంలో రెండు రోజుల్లో జరిగిన జాతీయ సమ్మె ఎందుకు ప్రముఖ ఉదాహరణలు ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తిని పక్కదారి పట్టించడానికి మతం ఆధారంగా ప్రజలలో చీలిక తీసుకురావడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నది అందులో భాగంగానే జనవరి 22న అయోధ్యలో రామ మందిర ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చేసి దేశవ్యాప్తంగా ఒక పెద్ద క్యాంపెయిన్ నిర్వహించింది అయినప్పటికీ జనవరి 26వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహించిన ట్రాక్టర్ పరేడ్లో వివిధ రాష్ట్రాలలో వేలాదిమంది రైతులు కార్మికులు పాల్గొన్నారు సమస్యల పట్ల మనం ప్రజలలో సరైన పద్ధతుల్లో క్యాంపెయిన్ నిర్వహిస్తే మతోన్మాద దాడి నుంచి ప్రజలను సమస్యలపై సమీకరించవచ్చని రుజువు అవుతున్నది వీటి ఆధారంగా రానున్న రోజుల్లో అసంతృప్తితో ఉన్న ప్రజలను సంఘటిపరిచి ఉద్యమాలవైపు తీసుకురావడానికి అన్ని స్థాయిల్లోనే కమిటీలు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.