
telugu galam news e69news local news daily news today news
ప్రజావాణిలో ప్రజలు అందించిన ధరఖాస్తులలోని సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు.సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సవ్ టొప్పో తో కలిసి ప్రజల నుండి వినతులను స్వీకరించారు ఈ సందర్భంగా తుర్కూరు మండలానికి చెందిన ఎం.డి చాందిని సుల్తానా ఆన్ లైన్ గేముల ద్వారా తన బ్యాంకు ఖాతాలోని డబ్బులు పోయాయాని న్యాయం చేసి తిరిగి తనకు డబ్బులను ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. మహబూబాబాద్ పట్టణం నందినగర్ కాలనీవాసులు తమ కాలనీలో కొన్ని సంస్థల వారు సెల్ టవర్ నిర్మించుట తలెపెట్టినారని తమ పిల్లల ఆరోగ్యాలను పరిగణలోకి తీసుకుని ఎటువంటి సెల్ టవర్ నిర్మాణం కొరకు పర్మిషన్ ఇవ్వరాదని కోరారు. అనంతరం గ్రామానికి చెందిన గుండ్ల శ్రీధర్ తనకు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో తన కాలు విరిగి పనులు చేసుకోనుటకు ఇబ్బందిగా ఉన్నదని సదరం లో వైకల్య ధ్రువీకరణ పత్రం అందజేసి తన కుంటుంబానికి అండగా నిలవాలని కోరారు. కేసముద్రం మండలం ప్రజలు మండలంలోని అర్పణపల్లి గ్రామ శివారులో మన్నికుంట చెరువు కబ్జా చేసి తవ్వకాలు చేస్తున్న సద్గురు స్టోన్ క్రషర్ మిల్లుపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ రోజు నిర్వహించిన ప్రజావాణిలో (135)దరఖాస్తులను వివిధ శాఖల అధికారులకు పరిష్కారానికి ఆదేశించారు. ఈ ప్రజావాణిలో జెడ్పి సీ.ఈ.ఓ రమాదేవి, సిపిఓ సుబ్బారావు, జిల్లా అధికారులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.