
ప్రపంచ జ్ఞాని అంబేద్కర్ ఆశయ సాధనే బహుజనులకు రాజ్యాధికారం
ప్రపంచ జ్ఞాని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆయన ఆశయ సాధనే బహుజనులకు రాజ్యాధికారం,రాజ్యాధికార సాధనకోసం బహుజనులంతా ఐకమత్యంతొ సాధించుకోవాలని బిఎస్పీ కార్మిక విభాగం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు ఐనాల పరశురాములు పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో యూత్ అధ్యక్షులు ఏడెల్లి వెంకటేష్ అధ్యక్షతన అంబేద్కర్ 132వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈసందర్బంగా బిఎస్పీ కార్మిక విభాగం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు ఐనాల పరశురాములు పాల్గోని ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుచు బహుజనులకు సామాజిక ఆర్ధిక, రాజకీయ సమానత్వం కోసం తనజీవితాన్ని త్యాగం చేసి చివరకు తన భార్య, పిల్లలను సంపుకొని ఓటు అనె ఆయుధాన్ని చేతిలో పెడితే రాజ్యాధికారం రుచి మరిగిన అగ్రకుల పార్టీల తోడేళ్ల మాయలో పడి ఓటు ను అమ్ముకొని నేడు ఎలాంటి అభివృద్ధి లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురవుచున్నారని అన్నారు.అభివృద్ధి కి ఆమడ దూరంలో ఉన్న బహుజనులంత ఏకమై బహుజన రాజ్యాధికారం వైపు నడవాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో బిఎస్పీ మరిపెడ మండల అధ్యక్షులు జినక కృష్ణమూర్తి, అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.