
గళం న్యూస్ శాయంపేట
శాయంపేట మండలం సూర్యనాయక్ తండా, సాధనపల్లి, రాజుపల్లి కాట్రపల్లి నూర్జహన్ పల్లి గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా ఆడపడుచులకు దసరా కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను మహిళకు పంపిణి చేసిన వరంగల్ జడ్పీ ఛైర్పర్సన్ భారత రాష్ట్ర సమితి భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి,
ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంగరంగ వైభావంగా నిర్వహించుకునే అతి పెద్ద పండగ బతుకమ్మ దసరా కానుకగాను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపడుచుకు చీరను అందించడం జరుగుతుంది అని అన్నారు.
అంతరం విద్యార్థులు క్రీడాల్లో రానించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న క్రీడా కిట్లను క్రీడాకారులకు అందించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.