
ఈ69న్యూస్ జనగా
ఈ69న్యూస్ జనగామE69new.com
జనగామ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద నిర్మాణం జరుగుతున్న బైపాస్ రోడ్ లో అండర్పాస్ బ్రిడ్జి నిర్మించి ప్రజలకు మేలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సిపిఎం జనగామ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి సిపిఎం జనగాం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షత వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ…ఈనెల సోమవారం 7వ తేదిన బాణాపురం దీక్ష శిబిరం నుండి పాదయాత్ర కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని కోరారు.గత 68 రోజులుగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న సంబంధిత అధికారులు ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు.అభివృద్ధి పేరుతో ప్రజలకు నష్టం చేయొద్దని విమర్శించారు.సుమారు 10,000 మందికి ఉపయోగపడే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడం సరైనది కాదన్నారు.ఇప్పటికే అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకపోవడంతో పాటు అన్ని రాజకీయ పార్టీల సహకారం కూడా కోరడం జరిగిందన్నారు.అదే సందర్భంగా భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కి వినతిపత్రం ఇచ్చి బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగే విధంగా కృషి చేయాలని కోరడం జరిగిందని అన్నారు.అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం నుంచి స్పందన లేకపోవడం వలన మూడో విడత మొదటి రెండు ఇందిరమ్మ కాలనీలకు ఎసిరెడ్డి నగర్ మూడో విడత ఇందిరమ్మ కాలనీ ఎల్లంల సిద్ధంకి చౌదరి పెళ్లి పెద్ద రామ చర్ల పోచ న్నపేట శ్రీనివాసపురం గుండ్లగూడెం వెళ్లే గ్రామాల ప్రజలకు ఇబ్బందులు జరుగుతాయని చెప్పిన అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం అన్నారు.అందుకే ఈ ప్రాంత ప్రజలందరిని సమీకరించి ఈనెల 7వ తేదీన పాదయాత్ర కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని ప్రభుత్వం అధికారులు దిగివచ్చి స్పష్టమైన ప్రకటన చేయకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్ జనగామ మండల కార్యదర్శి బోడ నరేందర్ పట్టణ కమిటీ సభ్యులు కళ్యాణం లింగం పందిళ్ళ కళ్యాణి మంగ బీరయ్య నాయకులు గుండె మల్లేష్ గాడి శివ ధరావత్ మహేందర్ భూనాద్రి వెంకటేష్ ఎర్ర రజిత కమల బూడిది సంపత్ పసలాది హరీష్ రాజు సుధాకర్ అంజమ్మ బాలస్వామి పద్మ తదితరులు పాల్గొన్నారు.