
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామంలో మంగళవారం రాత్రికరెంటు షార్ట్ సర్క్యూట్ వలన దామెర రాజ్ కుమార్ ఇల్లు కాలిపోయిన సంఘటన జరిగింది.అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరుగలేదు.కొంత మొత్తంలో ఆస్తి నష్టం మాత్రం జరిగింది.ఈ సందర్భంగా రాజ్ కుమార్ కుమార్తె దామెర దీక్ష గ్రామంలోని జడ్పిహెచ్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుచుండగా పాఠశాల ఉపాద్యాయ బృందం మరియు విద్యార్థులు బాదిత కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం తన ఉదారతను చాటుతూ..ఉపాధ్యాయులు 5వేల రూపాయలు,మరియు 7,8వ తరగతి చదువుచున్న విద్యార్థులు 3000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.