
ఈ69న్యూస్ మొవ్వ
కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని బట్ల పెనుమర్రు గ్రామంలోని మసీదు వద్ద అంతర్జాతీయ అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ”హ్యూమానిటీ ఫస్ట్”శాఖ ఆధ్వర్యంలో
ఇటీవల బట్లపెనుమర్రు గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ఇండ్లను కోల్పోయిన బాధితులకు అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ హ్యూమానిటీ ఫస్ట్ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు,సరుకులు పంపిణీ చేయడం జరిగింది.స్థానిక మౌల్వీ గురువు ముహమ్మద్ యాకూబ్ పాషా మాట్లాడుతూ..పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి మానవసేవ కార్యక్రమాలను చేసే అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని ఈ శాఖ ప్రపంచమంతా మానవాళికి ఎక్కడ విపత్తులు సంభవించిన మహనీయ ముహమ్మద్ ప్రవక్త (స) ఉపదేశమైన “సర్వ మానవులు అల్లాహ్ కుటుంబమే”అనే బోధనలను ఆదర్శంగా తీసుకొని తమ వంతు సహాయాన్ని చేస్తున్నదన్నారు.హ్యుమానిటీ ఫస్ట్ శాఖ ఇంచార్జ్ షేక్ ఇస్మాయిల్ మాట్లాడుతూ..అంతర్జాతీయ అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీని హజ్రత్ మిర్జా గులామ్ అహ్మద్(అ.స) గ 1889వ సంత్సరం భారతదేశంలో స్థాపింపచడం జరిగింది.నేడు విశ్వవ్యాప్తంగా కమ్యూనిటీ హజ్రత్ మీర్జా మస్రూర్ అహ్మద్ ఐదవ ఖలీఫా (ఉత్తరాధికారి)నేతృత్వంలో 200లకు పైగా దేశాల్లో ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తూ,“అందరిని ప్రేమించు ఎవ్వరినీ ద్వేశించకు” అనే నినాదంతో మానవ సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కూచిపూడి తహసీల్దార్ కె.మస్తాన్ రావు,కూచిపూడి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె.నాగ విశ్వనాథ్ బట్లపెనుమర్రు గ్రామ ప్రెసిడెంట్ పాల్గొని,కమ్యూనిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసీం,జిల్లా ఇంన్చార్జీ ముహమ్మద్ ఉస్మాన్,మస్జిద్ ప్రెసిడెంట్ షేక్ మౌలాలి షేక్ నాసర్ సాహెబ్ లాల్ సాహెబ్ తదితరులు కమ్యూనిటీ వాలంటీర్లు పాల్గోన్నారు.
