బీజేవైఎం జనగామ జిల్లా అధికార ప్రతినిధి చీమల నాగరాజు
E69 న్యూస్/ రఘునాథపల్లి :
భారతీయ జనతా యువమోర్చ జనగామ జిల్లా సంస్థగత నిర్మాణంలో భాగంగా *బీజేవైఎం జిల్లా కమిటీని జిల్లా అధ్యక్షులు శ్రీ జంగా రాజా వెంకట నర్సింహా రెడ్డి ప్రకటించడం జరిగింది, ఈ సందర్బంగా నర్సింహా రెడ్ది మాట్లాడతా విద్యార్థి నాయకునిగా ఎన్నో ఉద్యమాలు చేసి నిరుపేద విద్యార్థుల పక్షాన కొట్లాడి పోలీస్ కేసులను సైతం లెక్కచేయకుండా పోరాడిన వ్యక్తి చీమల నాగరాజు అని అన్నారు, ఇపుడు ప్రజల పక్షాన పోరాడుతు అదేవిధంగా బీజేవైఎం బలోపేతానికి కృషి చేయాలనీ శుక్రవారం గబ్బెట గ్రామం చెందిన చీమల నాగరాజు ని బీజేవైఎం అధికార ప్రతినిధి గా నియమించడం జరిగిందని అన్నారు, ప్రస్తుతం ఉన్న జిల్లా బాధ్యులు వారి సేవలను వినియోగించుకోవడం జరుగుతుందాని జిల్లా అధ్యక్షులు తెలియచేసినారు,
ఈ సందర్బంగా నాగరాజు మాట్లాడుతూ తనపై పెట్టిన నమ్మకానికి బాధ్యతయుతంగా పని చేస్తానని తన నియామకానికి సహకరించిన పార్టీ జిల్లా నాయకులకు, మండల నాయకులకు, కార్యకర్తలకు, హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు