బేస్మెంట్ కే పరిమితమైన డబుల్ బెడ్ రూం ఇండ్లు
పేదల,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కేవలం బేస్మేంట్ మరియు శిలాఫలకాలకే పరిమితమైందని బీజేపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి శుభాష్ మండిపడ్డారు.బుధవారం సుబాష్ నియోజక వర్గంలోని బీజేపీ నాయకులతో కలిసి డబుల్ బెడ్రూమ్ కోసం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో 27-12-2౦19 సంవత్సరంలో 5౦4.౦౦ లక్షల రూపాయల నిథులతో స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య శంఖుస్థాపన చేసిన స్థలాన్ని సందర్శించారు.అనంతరం వారు మాట్లాడుతూ..నాలుగు సంవత్సరాలు గడిచినా డబుల్ బెడ్రూం ఇండ్లు బేస్మెంట్ మరియు శిలాఫలకానికే పరిమితమైందని అన్నారు.2౦18 సంవత్సరంలో డబుల్ బెడ్రూం పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారం చేపట్టిన బిఆర్ఎస్ పార్టీని
రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓడించి బొందపడతారని అన్నారు.ఇప్పుడేమో గృహలక్ష్మీ పేరుతో మాయమాటలు చెప్పి అధికారం చేపట్టాలని చూస్తున్నారని తెలంగాణ ప్రజలు ఆలోచన కలిగిన వారని నమ్మితే ప్రాణమిస్తారు,నమ్మక ద్రోహం చేస్తే ప్రాణం తీస్తారని బిఆర్ఎస్ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని దానికి తగిన గుణపాఠం తెలంగాణ ప్రజలు త్వరలో చెబుతారని అన్నారు.నియోజక వర్గ కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇండ్లకు మంజూరైన 5౦4 లక్షల నిధులు ఏమైయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు