
telugu galam news e69news local news daily news today news
స్థానిక సారపాక లో గల బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత బిఎన్ఆర్ గారికి ఇటీవల కాలంలో ప్రఖ్యాత శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారి రాష్ట్రస్థాయి ఉత్తమ కరస్పాండెంట్ అవార్డు సాధించినందుకు గాను భద్రాచలంలో ఉన్న ప్రముఖ విద్యాసంస్థ మదర్ తెరిసా డిగ్రీ కాలేజీ వారు బిఎన్ఆర్ గారికి ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా కాలేజ్ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ బి ఎన్ ఆర్ నిరంతర శ్రమజీవని ప్రతిక్షణం విద్యార్థులతోనే గడుపుతూ ఉత్తమ కరస్పాండెంట్ అవార్డుకు నిజమైన అర్హులని అన్నారు, అనంతరం బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత బిఎన్ఆర్ గారు మాట్లాడుతూ మనిషి సాధించిన విజయాలకు ఇటువంటి సన్మానాలు నూతన ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తాయని ఈ అవార్డు సాధించటం వలన మరింత పనిచేసి సారపాక పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులను ఉన్నత విద్య వైపు నడిపించాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేసిన మదర్ తెరిసా యాజమాన్యానికి ధన్యవాదములు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా కాలేజీ యాజమాన్యం మరియు బ్రిలియంట్ విద్యాసంస్థల ఉపాధ్యాయ మరియు అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.