భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి పడి పూజ
కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి అభిషేక కార్యక్రమం తిలకించిన అయ్యప్ప భక్తులు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రం రాంపురం గ్రామం లో కాంగ్రెస్ పార్టీ మరిపెడ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరా రెడ్డి త్రివేణి,సర్పంచ్ పెండ్లి శ్రీనివాస్ రెడ్డి రమాదేవి దంపతులు నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం తొర్రూర్ గురుస్వాములు మాజేటి నరసింహారావు,కొనుగంటి కృపాకర్ రాజు గురుస్వామి, రాంపురం అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు,ఈ యొక్క కార్యక్రమం నికి ముఖ్య అతిథిగా డోర్నకల్ శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ సతీమణి ప్రమీల హాజరై పడిపూజ కార్యక్రమాన్ని తిలకించారు,అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. 41 రోజులు భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాల ధరించి,శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న అయ్యప్ప స్వామి మాలధారులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు,అయ్యప్ప స్వామి పడి పూజ లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. శబరిమల లో చేసిన విధంగా అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం కనుల పండుగగా జరిగింది, అయ్యప్ప దర్శనం ఎక్కే 18 మెట్లపై పడి వెలిగించి అయ్యప్పని తనివితీరా చూసినంత గొప్పగా పడిపూజ మహోత్సవం జరిగింది, పాటలు పాడుతూ భజనలు చేస్తూ భక్తి పార్వషo లో మునిగిపోయారు,అనంతరం అయ్యప్ప స్వామి మంత్రోచ్ఛారణలు, భజనలు భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలో ముంచెత్తాయి,పడి పూజ కార్యక్రమం ద్వారా భక్తుల్లో నియమ నిష్ఠలు, క్రమశిక్షణ, ఐక్యత పెంపొందుతాయని తెలిపారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రతి భక్తుడి కోరికలు నెరవేరాలని ఆకాంక్షించారు.
పూజ అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా గ్రామస్తులు, స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు,ఈ కార్యక్రమంలో రాంపురం అయ్యప్ప గురు స్వాములు ఆదిమూల యాకయ్య, మాడుగుల వెంకన్న, చిర్ర పల్ల వెంకన్న గురుస్వామి, రాంపెల్లి పెద్ద లింగన్న స్వామి,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.