
ఈ69న్యూస్ హన్మకొండ
భద్రకాళి చెరువు పూడికతీత మట్టి తరలింపును పగలు మాదిరిగానే రాత్రి వేళలోనూ జాగ్రత్తగా తరలించే విధంగా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.మంగళవారం రాత్రి వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే,హనుమకొండ,వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి,సంధ్యారాణి,ఇతర శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ భద్రకాళి చెరువు మట్టి తరలింపు ప్రక్రియను పరిశీలించారు.రాత్రి వేళలో చెరువు పూడిక మట్టిని తరలింపునకు సంబంధించిన ఏర్పాట్లను సాగునీటి పారుదల శాఖ ఎస్ఈ వెంకటేశ్వర్లు,ఈఈ శంకర్ చౌహన్ లను కలెక్టర్లు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ..చెరువు మట్టి తరలింపులో రాత్రివేళ కూడా ఎక్కువ ట్రిప్పులు వెళ్లే విధంగా చూడాలన్నారు.పూడిక మట్టిని తరలించేందుకు చెరువులో మరిన్ని అంతర్గత రహదారులు ఏర్పాటు చేయాలన్నారు.మట్టి తరలింపు సంబంధించి అధికారులకు కలెక్టర్లు పలు సలహాలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కుడా పిఓ అజిత్ రెడ్డి,ఈఈ భీమ్ రావు,ఏసీపీలు దేవేందర్ రెడ్డి,సత్యనారాయణ,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.