
భద్రాచలంలో ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన అత్యున్న స్థాయి
భద్రాచలంలో ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన అత్యున్న స్థాయి మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది
అయితే 180 కోట్ల దేవాలయం అభివృద్ధి ప్లాన్ తయారవగా అందులో 41 కోట్ల రూపాయలు దేవాలయం చుట్టూ ఉన్న 80 ఇల్లు తొలగించినట్లయితే వారికి నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని మీటింగ్ అభిప్రాయపడ్డది.
అయితే దేవాలయం చుట్టూ ఉన్న ఇల్లు తొలగింపు కార్యక్రమానికి ఆయా ఇంటి యజమానులతో మాట్లాడటానికి ఒక కమిటీని కుడా ఏర్పాటు చేయనట్లు తెలిసింది.
ఆ ఇంటి యజమానులు తో ఈ కమిటీ సభ్యులు మాట్లాడి నష్ట పరిహారంతో పాటు వారికి భద్రాచలంలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా అందించడానికి అవసరమైన స్థలాల ఎంపిక కూడా ఈ కమిటీ ద్వారా చేపట్టనున్నట్లు తెలిసింది.
ఏది ఏమైనా ఈ వ్యవహారం అంతా పూర్తి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ అభివృద్ధిపై స్పష్టమైన ప్రకటన చేసే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. దేవాలయం అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు దేవదాయ శాఖ అధికారులు పాల్గొన్నట్లు తెలిసింది.