
telugu galam news e69news local news daily news today news
రూ.15 లక్షల ఆస్తి నష్టం
నిరసన తెలుపుతున్న భాధితులు
భద్రాచలం పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. స్థలం యజమాని, హోటల్ ఒనర్స్ మధ్య అగ్రిమెంట్ విషయంలో మాటలు నడుస్తుండగా.. శుక్రవారం రాత్రి హోటల్ బంద్ చేసి ఇంటికి వెళ్లిన తర్వాత సుమారు 50 మందికి పైగా గూండాలు వచ్చి, తాళాలు బద్ధలుకొట్టి హోటల్ ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు హోటల్ ఓనర్స్ కొండారెడ్డి, రమ్యశ్రీ తెలిపారు. సుమారు 15 లక్షలు ఆస్థి నష్టం వాటిల్లిందని, మాకు న్యాయం చేయాలంటూ హోటల్ ముందు నిరసనకు దిగారు. వీరికి భద్రాచలం హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, వాసు, మధువన్ రెడ్డి తదితరులు మద్దతు తెలియచేసారు. న్యాయం జరిగే వరకూ భద్రాచలం పట్టణంలోని హోటల్స్ బంద్ కు పిలుపునిచ్చారు