
భారత దేశంలో IT రంగానికి పునాదులు వేసిన దూరదర్శి రాజీవ్ గాంధీ
సాంకేతిక విప్లవం ద్వారా భారత దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటి పడే విధంగా పునాదులు వేసింది రాజీవ్ గాంధీ – రాజీవ్ గాంధీ
భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్ర పటానికి, ఎం.జి.ఎం కూడలి వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి మరియు టైలర్ స్ట్రీట్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు శ్రీ. నాయిని రాజేందర్ రెడ్డి గారు పూల మూల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..
ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి
సమర్థవంతంగా సుస్థిర పాలన అందించిన రాజకీయ నాయకుడిగా రాజీవ్ గాంధీ చరిత్రకెక్కారు
భారత దేశంలో IT రంగానికి పునాదులు వేసిన దూరదర్శి రాజీవ్ గాంధీ
సాంకేతిక విప్లవం ద్వారా భారత దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటి పడే విధంగా పునాదులు వేసింది రాజీవ్ గాంధీ
భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు ఆధ్యులు రాజీవ్ గాంధీ.
రాజీవ్ గాంధీ అధికారంలో ఉన్న సమయంలో, ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీలు MTNL మరియు VSNL అభివృద్ధి చేయబడ్డాయి
యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించింది రాజీవ్ గాంధీ
ప్రపంచంలో ఎక్కడో పుట్టిన కంప్యూటర్ రంగాన్ని మన దేశానికి పరిచయం చేసి ఎంతో మంది విద్యార్థులు సాంకేతిక విద్యను నేర్చుకులనేలా చేసింది రాజీవ్ గాంధీ
గ్రామాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ ఎంతగానో కృషి చేశారని, ఐటీ రంగంలో నేడు ఇండియా అగ్రగామిగా ఉందంటే అది రాజీవ్ గాంధీ కృషి ఫలితమే అన్నారు.
రాజీవ్ సంస్కరణ ఫలితాలు మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం.
అభివృద్దికోసం ఆఖరు రక్తపు బొట్టు వరకు దేశం కోసం ప్రాణాలు అర్పించారు
రాజీవ్ గాంధీ ఆశయాలకోసం, పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ బాధ్యులు నమిండ్ల శ్రీనివాస్, పిసిసి మాజీ సబ్యులు ఈ..వి. శ్రీనివాస్ రావు, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మిర్జా అజీజుల్లా బేగ్, జిల్లా ఒబిసి డిపార్టుమెంటు చైర్మన్ బొమ్మతి విక్రం, జిల్లా INTUC అధ్యక్షుడు కూర వెంకట్, జిల్లా AIUWC జిల్లా అధ్యక్షురాలు గుంటి స్వప్న, MV సమత, జిల్లా NSUI అద్యక్షుడు పల్లకొండ సతీష్, టిపిసిసి ఒబిసి డిపార్టుమెంటు కన్వినర్ పులిరాజు సీనియర్ నాయకులు తౌటం రవీందర్, మహమ్మద్ అంకుష్, నల్ల సత్యనారాయణ, బండారి జనార్ధన్ గౌడ్, బొంత సారంగం, ఇప్ప శ్రీకాంత్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బంక సంపత్ యాదవ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి డివిజన్ అద్యక్షులు మహమ్మద్ జాఫర్, కొండా నాగరాజు, సయ్యద్ అఫ్సర్, గన్నారపు సంగీత్, నాయకులు కే. సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రవణ్ కుమార్, సంగాల ప్రశాంత్ కుమార్, మహమ్మద్ అబ్దుల్ బాకి, మహమ్మద్ నదీం, సాజిద్, సాయిరాం యాదవ్, పి. అనిత, దినేష్, అలేగ్జాందర్, తదితరులు పాల్గొన్నారు.