
భారత రాజ్యాంగ పరిరక్షణకు పోరాటాలే మార్గం.. కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి మంద సంపత్
ఈరోజు కెవిపిఎస్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు దూడపాక రాజేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంద సంపత్ గారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం పై దాడిని ముమ్మరం చేసిందని దాని కాపాడుకోవడానికి కేవీపీఎస్ పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
రాజ్యాంగంలోని మూల సూత్రాలైన ప్రజాస్వామ్యం. లౌకిక పదాలను తొలగించి రాజ్యాంగంపై దాడి మొదలుపెట్టిన బిజెపి. నేడు రాజ్యాంగ సంస్థలను ఉపయోగించి ప్రశ్నించిన వారిపై దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని. కులాలు మతాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటుంది.
బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కుల దురంకార హత్యలు. అత్యాచారాలు పెరిగాయని. సమాజంలో కులాలుగా విడిపోయిన ప్రజలు. నేడు మతాలుగా మరింత విడిపోతున్నారని ఇది చాలా ప్రమాదకరమని ఇలాంటి విచ్ఛిన్న రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బిజెపికి రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించి ఓటు ద్వారానే తగిన సమాధానం చెప్పాలని. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ రిజర్వేషన్లను లేకుండా చేస్తున్నదని. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కెవిపిఎస్ డిమాండ్ చేస్తుంది అందుకు పోరాటం చేయాలన్నారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీలుగా సర్టిఫికెట్ ఇవ్వాలి. భారత రాజ్యాంగాన్ని తొలగించి దాని స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెట్టడానికి బిజెపి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తుందని దానికి వ్యతిరేకంగా కెవిపిఎస్ పోరాటం చేయాలన్నారు. జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతిని అనుమకొండ జిల్లా అంతట నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు సాధించుట కొరకు. రాజ్యాంగ పరిరక్షణకు కెవిపిఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య జిల్లా నాయకులు కనకం కావ్య శ్రీ బొట్ల కుమార్ మామిడి రమేష్ అర్థం రామ్ కి జన్ను మహేందర్ రేణిగుంట చందర్ ఇమ్మడి సుధాకర్ దామెర రాజు. గద్దల బద్రి ఎనగందుల బాబురావు గజ్జి కోటేశ్వర్ బొట్ల సారంగం శనిగరం జనార్ధన్. తదితరులు పాల్గొన్నారు