
9 ఏండ్ల కాలంలో భద్రాద్రి అభివృద్ధిని గాలికి వదిలేసిన బిఆర్ఎస్ సర్కార్
కేవలం ఎన్నికల వ్యూహంలో భాగంగానే హడావిడిగా శంకుస్థాపనలు ఆర్భాటాలు
కేటీఆర్ పర్యటన అభివృద్ధి కోసం కాదు ఓట్ల కోసం సీట్ల కోసం
మంత్రి కేటీఆర్ పర్యటనను ప్రజల పక్షాన సిపిఐ వ్యతిరేకిస్తుంది..
భద్రాచలం29/09/2023.
30వ తేదీన భద్రాచలం పర్యటనకు వస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు పర్యటనను ప్రజల పక్షాన సిపిఐ వ్యతిరేకిస్తుందని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భద్రాచలం పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్ కుమార్ అన్నారు.
శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొమ్మిదేళ్ల కాలంలో భద్రాచలం అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం ఎన్నికల్లో ఓట్లు సీట్లు కోసమే హడావుడిగా శంకుస్థాపనలు ఆర్భాటాలు చేస్తున్నారని అన్నారు..
గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రామాలయం అభివృద్ధికి వంద కోట్లు భద్రాచలం గోదావరి వరదల సందర్భంగా కరకట్టల నిర్మాణానికి 1000 కోట్ల రూపాయలు ప్రకటించిన నిధులు తీసుకొని రావాలని అన్నారు..
భద్రాచలం ప్రాంతాన్ని గోదావరి వరదల నుంచి రక్షించాలి అంటే పోలవరం బ్యాక్ వాటర్ ప్రమాదం ఉన్నందున గోదావరి ఇరువైపులా కరకట్టల నిర్మాణం చేసి ప్రస్తుతం ఉన్న కరకట్టను ఎత్తు పొడుగు పెంచాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తుంటే కేవలం ఎన్నికల వ్యూహాల్లో భాగంగా 520 మీటర్లు కరకట్ట నిర్మాణానికి శంకుస్థాపన హడావిడిగా చేయటం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
భద్రాచలం పట్టణం ఇప్పటికే రాష్ట్ర విభజన నేపథ్యంలో పూర్తిగా నష్టపోయి ఉన్నచందంగా ఉంటే ఈ ప్రాంత ప్రజల మనోభావాలు గుర్తించకుండా కేవలం అధికార బలంతో భద్రాద్రి 3 గ్రామపంచాయతీలుగా ముక్కలు చేసినందుకు కేటీఆర్ పర్యటన స్వాగతించాలా అన్నారు..
ఈ ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని భద్రాద్రి ఒకటే గ్రామ పంచాయతీగా కొనసాగించాలని అన్నారు..
భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్న ఐదు గ్రామపంచాయతీలు తెలంగాణకు కావాలని ఈ ప్రాంత ప్రజల కోరుతుంటే తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్లో ఎందుకు తెరాస ఎంపీలు ప్రశ్నించలేదని ఇవన్నీ భద్రాచలం ప్రజలకు గుర్తు ఉన్నాయని కేవలం ఎన్నికల్లో ఓట్లు సీట్ల కోసం ప్రజలను మభ్య పెట్టడానికి భద్రాచలం వస్తున్న కేటీఆర్ కు బిఆర్ఎస్ పార్టీకి ఈ ప్రాంత ప్రజలు మరొకసారి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని అన్నారు..
నియోజకవర్గంలో ఉన్న వలస ఆదివాసుల ఓట్లు కావాలి కానీ వలస ఆదివాసులు సాగు చేసుకుంటున్నా పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని అన్నారు..
ఈ సమావేశంలో సిపిఐ నాయకులు మారెడ్డి శివాజీ .బత్తుల నరసింహులు. ఎస్ వి ఎస్ నాయుడు. గుంజ ఏడుకొండలు. గుంజ బాబు .చాడా శోభన్ బాబు. నాని పల్లి శ్రీను .మురాల డానియల్ ప్రదీప్. మారెడ్డి గణేష్ .తదితరులు ఉన్నారు