
telugu galam news e69news local news daily news today news
రాఘవపట్నం వంతెన మరమ్మత్తు కొరకు, సమ్మక్క గుడికి కలిపి 45 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు మంత్రి సీతక్కపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం రోజున గోవిందరావుపేట మండల రాఘవపట్నం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కంటెం సూర్యనారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు దనసరి సీతక్క రాఘవపట్నం దెయ్యాలవాగు వంతెన కోసం 40 లక్షల రూపాయల నిధులు, సమ్మక్క సారలమ్మ తల్లులకు 5 లక్షల రూపాయల నిధులు విడుదల చేసినందుకు గాను గ్రామస్థులు అందరూ హర్షం వ్యక్తం చేస్తూ సీతక్క చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోరం రామ్మోహన్, దబ్బకట్ల రంగారావు, మంకిడి రవి, ఎండి. షరీఫ్, దబ్బకట్ల జనార్ధన్, పాయం స్వరూప, కంతెం విజయలక్ష్మి, బొడిగా అనసూర్య, కంటేం సాంబలక్ష్మి, నేహా తదితరులు పాల్గొన్నారు.