మట్టిలో మాణిక్యం
SI గా ఎన్నికైన కందుకూరు సోనిని అభినందించి సన్మానించిన కల్లుగీత కార్మిక సంఘం…….
బచ్చన్నపేట మండలం కొన్ని గ్రామానికి చెందిన కందుకూరి సోనిని గౌడ విద్యార్థి యువత మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిది గోపి అన్నారు.ఈరోజు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన పోలీస్ ఎస్ఐ సెలక్షన్లో ఎస్సైగా ఉత్తీర్ణత పొందిన కందుకూరి సోనీ స్వగ్రామమైన బచ్చన్నపేట మండలం కొన్ని గ్రామపంచాయతీ ఆవరణలో సోనీ తల్లిదండ్రులు కందుకూరి శంకరయ్య బుచ్చమ్మ ఆదర్శ దంపతులను అభినందించి వారితోపాటు వారి కూతురు సోనిని సన్మానించడం జరిగింది.
ఈసందర్భంగా KGKS రాష్ట్ర కార్యదర్శి బూడిది గోపి జిల్లా కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య మాట్లాడుతూ కల్లుగీత వృత్తిని జీవనాధారంగా చేసుకొని ఎన్నో కష్టనష్టాలు ఇబ్బందు పడుతు శంకరయ్య బుచ్చమ్మ దంపతులను వారి ఆరుగురు ఆడపిల్లలను కొడుకును గొప్పగా చదివించారు.ఏరోజు ఆడపిల్లలని కుంగిపోకుండా వారిని చదువు ఆటపాటలలో ప్రోత్సహించారని ఆడపిల్ల పుట్టిందంటే ఎంతో భారంగా భావించి ఎప్పుడు పెళ్లి చేసి అత్తగారింటికి పంపాలే అనే ఆలోచించే ఈసమాజంలో అలా పాత మూడ పద్ధతి ఆలోచనలు కాకుండా పిల్లలను చదివించాలని ఆచదివే సమాజంలో వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దగలరని వారి భవిష్యత్తు బాగుండాలని ఎన్నో ఆశలు ఆకాంక్షలతో కష్టపడి పిల్లల్ని క్రమశిక్షణగా పెంచిన ఫలితంగానే తల్లిదండ్రుల కలలు నిర్ణయం చేస్తూ కందుకూరి సోనీ నేడు ఎస్సైగా మొదటి సారే ఎన్నిక కాగలిగిందని అన్నారు.ప్రతిభకు పేదరికం అడ్డు కాదని పట్టుదల కృషి క్రమశిక్షణ ఉంటే సోనీ లెక్క విజయం సాధించవచ్చునని నేటి గౌడ కల్లుగీత యువత అలాగే సమాజంలోని అన్ని తరగతుల యువత సోనిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.అలాగే భవిష్యత్తులో సోని తన విధి నిర్వహణలో నీతి నిజాయితీగా మానవతా కోణంతో ప్రజలకు ఉన్నతమైన సేవలు అందించే గొప్ప పోలీస్ అధికారిగా పేరు ప్రఖ్యాతలు గడించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంకా ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచి వేముల వెంకటేశు మాజీ ఎంపీటీసీ అంబాల ఆగయ్య మాట్లాడారు.ఈకార్యక్రమంలో జిల్లాకమిటీ సభ్యులు జాన్నగొని శ్రీనివాస్ గౌడ్ బండపల్లి శంకరయ్య గౌడ్ బొమ్మిన రాజయ్య గౌడ్ కక్కెర్ల రాజు గౌడ్ బొమ్మల సందీప్ గౌడ్ పాలరాజు ఎంపీటీసీ మల్గా నర్సమ్మ సిద్ధిరాములు సొసైటీ అధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.