మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు నిర్ణయించి వీరిని కార్మికులకు గుర్తించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా సహయ కార్యదర్శి ఎన్ రజిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈరోజు హనుమకొండ ఎమ్మార్వో గార్లకు వివిధ డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
రజిత మాట్లాడుతూ… దేశంలో మన రాష్ట్రంలో లక్షల మంది స్కీమ్ వర్కర్లు గత 40 సం॥లకు: పైగా పని చేస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వ సేవలను గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాలలో ఉన్న అత్యంత పేదలకు అందించడంలో ఈ కార్మికులు సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో మహిళలు, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారే అత్యధికమంది ఉన్నారు. అత్యంత కీలక పథకాల నిర్వహణలో పనిచేస్తున్న వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఒకవైపు ఆకాశన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు, మరోవైపు చాలీచాలని వేతనాలతో స్క్రీమ్ వర్కర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మోయలేని పని భారంతో కునారిల్లుతున్నారు. దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్లు సమస్యల పరిష్కారం కోసం సిఐటియు అనేక పోరాటాలు నిర్వహించింది. ఈ పోరాటాలు ఫలితంగా 2013 మే నెలలో 45 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, స్కీమ్ ప్రైవేటీకరణ ఆపాలని తీర్మానం చేసింది. ఈ నిర్ణయం. జరిగి 8 సం॥లు దాటింది. అయినా కేంద్ర ప్రభుత్వం వీటిని అమలు చేయకపోవడం వల్ల స్కీమ్ వర్కర్లు తీవ్రంగా నష్టపోతున్నారు.
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీమ్‌లను నిర్వీర్యం చేసే అనేక ప్రయత్నాలు చేస్తున్నది. స్కీమ్‌లకు బడ్జెట్‌ను 60%నికి తగ్గించింది స్కీమ్‌లను ఎప్పుడైనా నిలుపుదల చేసే విధంగా అధికారాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నది. గత కొంత కాలంగా స్కీమ్‌లను స్వచ్ఛంద, ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయం చేసింది. ఈ నష్టదాయకమైన నిర్ణయాలు అమలు జరిగితే స్కీమ్ వర్కర్ల ఉపాధితో పాటు పేద ప్రజలకు స్కీమ్ ద్వారా అందుతున్న సేవలు దూరమవుతాయి. ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్న 121 దేశాలలోఐసిడిఎస్, ఎండిఎంఎస్. ఎన్హెచ్ఎం తదితర స్కీమ్ ప్రైవేటీకరణ ఆపాలి. బడ్జెట్ పెంచి బలోపేతం చేయాలి.. ఎస్ఇన్-2020 మరియు డిజిటల్ హెల్త్ మిషన్న ఉపసంహరించుకోవాలి..
స్కీమ్ వర్కర్లందరినీ పర్మినెంట్ చేయాలి. 45వ ఐఎల్ సి సిఫారసుల ప్రకారం స్కీమ్ వర్కర్లందరికీ కనీస వేతనం
రూ.26,000/-లు చెల్లించాలి.స్కీమ్ పర్వర్లందరికీ నెలకు రూ. 10,000/-లు పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ మొదలైన అన్ని
సామాజిక భద్రతా చర్యలను అమలు చేయాలి,అన్ని రాష్ట్రాల్లోని వివిధ రకాల స్కీమ్ వర్కర్లకు ఒకే విధమైన సర్వీస్ రూల్స్ ఉండాలి, 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలి. స్కీమ్ వర్కర్లను కార్మిక చట్టాల పరిధిలోకి తేవాలి.
ఈ కార్యక్రమంలో సరోజ సుశీల రమ వినోద తదితరులు పాల్గొన్నారు