
telugu galam news e69news local news daily news today news
– సర్పంచ్ తో సహా 8 మంది వార్డు మెంబర్లకు ఘన సన్మానం –
మండల పరిధిలో మల్సూర్ తండ గ్రామపంచాయతీలో సోమవారం ఉదయం ఆ గ్రామ సర్పంచ్ మాలోతు కళ్యాణి మరియు పాలకవర్గాన్ని ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారు..
ఈనెల 31న వారి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో సర్పంచ్, మరియు ఎనిమిది మంది వార్డు మెంబర్లు ను ఆయన శాలావాలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సర్పంచ్ కళ్యాణి, వారి పాలకవర్గం పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారని ప్రభుత్వసంక్షేమాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకం అందేదానికి కృషి చేశారని అంతేకాకుండా గ్రామములో మౌలిక వసతులు కల్పించడంలోనూ విద్య, వైద్య తదితర రంగాలలో గ్రామం అభివృద్ధి చెందేలా ప్రయత్నం చేశారని ఈ సందర్భంగా ఆయన ఆమె సేవలను కొనియాడారు...
ఈ కార్యక్రమంలో వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ధూపాటి భద్రరాజు,దుగ్గిదేవర వెంకట్ లాల్, తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు, స్థానిక సర్పంచ్ మాలోతు కళ్యాణి,ఉప సర్పంచ్, ఎంపీటీసీ బానోతు మోహన్ మాజీ సర్పంచ్ లింగ్యా, పంచాయతీ సెక్రెటరీ, అంగన్వాడి టీచర్, మల్టీపర్పస్ వర్కర్లు,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...