
e69 news telugu news local news
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో శుక్రవారం రోజున 2005 ఫిబ్రవరి 2 బండ్లకుంట అనే గ్రామంలో ప్రారంభమైన 100 రోజుల పనిని పేద ప్రజల కోసం పార్లమెంటులో అప్పటి దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ చట్టాన్ని తీసుకురావడమైనది 19వ సంవత్సరము ప్రారంభమైన సందర్భంగా ఉపాధి హామీ లో పనిచేస్తున్న కూలీలందరూ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మండల కేంద్రంలో ఆకుల వారి ఘనపురం ఎర్రకుంట చెరువు వద్ద ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోఏపీవో చరణ్ రాజు హాజరైనారుఉపాధి హామీ పథకం వలన అనేకమంది పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలియజేశారు అదేవిధంగా వ్యక్తిగత పనులకు సంబంధించి సామాజిక పనులకు సంబంధించి వ్యవసాయ అనుసంధానం పనులకు సంబంధించి పండ్లతోటల పెంపకం గురించి మేకల షెడ్లు మరియు గేదెల షెడ్లు కోళ్ల షెడ్లు నిర్మాణం గురించి చేపల చెరువుల నిర్మాణం గురించి ఫారం పండు నిర్మాణం గురించి కొబ్బరి మొక్కల పెంపకం గురించి అన్ని రకాల పనులకు సంబంధించి ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పేదవారికి ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుతుంది అని విషయాన్ని కూలీలకి సవివరంగా తెలియజేయడమైనది ప్రతి ఒక్కరు రైతులు మరియు కూలీలు జాబు కార్డు ఉన్న లబ్ధిదారులు అందరూ కూడా ఈ పథకంలో ఉపయోగించుకోవాలని వారికి తెలియజేయడమైనదిఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ సాంబశివరావు 80 మంది కూలీలు హాజరు అయ్యారు