
ఈ69న్యూస్ వరంగల్ /స్టేట్ బ్యూరో రిపోర్టర్ ముహమ్మద్ సలీం
మహాత్మ జ్యోతిరావు పూలే విధానాలు అనుసరించడం అంటే మనుధర్మపు దుష్టచింతనలపై,కులవివక్షపై రాజీలేని పోరాటం చేయడమే”అని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) వరంగల్ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ పేర్కొన్నారు.మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతిని పురస్కరించుకుని కెవిపిఎస్ ఆధ్వర్యంలో ములుగు రోడ్ జంక్షన్లోని ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అరూరి కుమార్ మాట్లాడుతూ..”దేశంలో ఒకప్పుడు శూద్రులు విద్యను అభ్యసించకూడదని,వేదాలు చదవకూడదని మనుస్మృతి లాంటి దుష్ట విధానాలు అమలులో ఉండే కాలంలో,జ్యోతిరావు పూలే బాల్యంలోనే కులవివక్షకు గురై అనేక అవమానాలు ఎదుర్కొన్నారు.అదే ఆయనలో పోరాట శక్తిని నూరిపోసింది,”అని పేర్కొన్నారు.జ్యోతిరావు పూలే విద్యను శక్తివంతమైన ఆయుధంగా భావించి,స్వంతంగా విద్యాసంస్థలు ఏర్పాటు చేసి, బడుగు బలహీన వర్గాలకు విద్య అందజేసిన మహనీయుడని కొనియాడారు.”అసమానతలు తొలగించాలంటే విద్యే మార్గమని పూలే నమ్మారు.ఆయన బాటలో నడవడమే నిజమైన నివాళి” అని అన్నారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఉసిల్ల కుమార్,జిల్లా నాయకులు పులిమాటి శివ,మాదాసు వీరస్వామి,జరిపెల్లి కుమారస్వామి,ఇల్లు అందుల ఎలిషా,వెంకట్ కట్కూరి,రాజు తదితరులు పాల్గొన్నారు.