
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ డివిజన్ కేంద్రంలోని శివునిపల్లి అనిత ఎంటర్ప్రైజెస్ లో శుక్రవారం ఏపిఎం కుమారస్వామి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.మహిళలు ఇంటి వద్దనే ఉంటూ ఓత్తులు,వెల్వెట్ పెన్సిల్స్ తయారీ ద్వారా సుమారు 20వేల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉందని ఈ కార్యక్రమం పైన అన్ని గ్రామ మహిళా సంఘాల వివో ఏలకు అవగాహన కల్పించి ప్రత్యక్షంగా తయారీలో పాల్గొనే విధంగా చేశారు.వివోఎలు కూడా తయారీ విధానం చాలా సులభంగా ఉందని సంతోషాన్ని వెలుబుచ్చారు.సంబంధిత రామేటీరియల్ కూడా అనిత ఎంటర్ ప్రైజెస్ నందు అందుబాటులో ఉంటుందని తయారీ తర్వాత మెటీరియల్ కూడా సప్లైదారులే కొనుగోలు చేస్తారన్నారు.కావున తయారీదారులకు మార్కెట్ పరంగా కూడా ఏలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఏపిఎం స్టేషన్ ఘనాపూర్ కుమారస్వామి,సీసీలు కుమార్,యాదగిరి,రజిని,ఉమారాణి,రమ్య,శివునిపల్లి నవయుగ మహిళా మండలి వివోఏ వసంత,మేకల రామచంధ్రు,ఇర్రి కవిత,బేతి మంజుల,అన్ని గ్రామపంచాయతీల వివోఏలు పాల్గొన్నారు.