
మహిళల విద్య కోసం వారి త్యాగం గొప్పది: ఐద్వా
మహిళల విద్య కోసం సావిత్రిబాయ్ పూలే త్యాగం గొప్పదని ఐద్వా హన్మకొండ సౌత్ మండల కార్యదర్శి సాంబరాజు శ్వేతా అన్నారు. శుక్రవారం అదాలత్ అమరవీరుల స్తూపం వద్ద సావిత్రి బాయ్ పూలే వర్దంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సమాజానికి, దేశానికి అందించిన సేవలు మరవలేనివి అన్నారు. భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా మహిళలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రజలు,స్త్రీల విద్యా కోసం అహర్నిషలు పాటుపడిన మహోనన్నతురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. అలాగే ఇప్పుడున్న పాలకులు మహిళలకు విద్యను అందించడంలో హక్కులు కల్పించడం లో విఫలం చెందయన్నారు. కాబట్టి వారి ఆశయాల కోసాగించడం కోసం మహిళలు గా మనందరం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతి, ఇందిరమ్మ, మాధవి, నాంక్, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.