
బాధిత కుటుంబానికి అండగా అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ
అహ్మదీయ ముస్లింలు మానవత్వం చాటుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు.పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం,కొత్తపల్లి గ్రామం పరిదిలోని దిబ్బగూడెంకు చెందిన నరసింహులు అనే వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు.విషయం తెలుసుకున్న కొత్తపల్లి గ్రామ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ సభ్యులు బాధితుని ఇంటికి వెళ్ళి పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు.పవిత్ర రంజాన్ మాసంలో బాధితుని కి సహాయం చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని అహ్మదీయ కమ్యూనిటీ ప్రెసిడెంట్ నాగూర్ పేర్కొన్నారు.సర్వ మానవులు అల్లాహ్ కుటుంబమే అనే ముహమ్మద్ ప్రవక్త మార్గదర్శక సిద్ధాంతాన్ని అనుసరించి,సమాజానికి తమ వంతు సేవను అందిస్తున్నట్లు తెలిపారు.అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీని హజ్రత్ మిర్జా గులామ్ అహ్మద్ (అ.స)1889లో స్థాపించడం జరిగిందని,కమ్యూనిటీ ప్రస్తుత ఐదవ ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ నేతృత్వంలో 200కి పైగా దేశాల్లో ప్రేమ అందరితో ద్వేషం ఎవ్వరితో లేదు అనే నినాదంతో మానవ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.అహ్మదీయుల సేవలను పలువురు ప్రశంసించారు.కార్యక్రమంలో స్థానిక మౌల్వీ రఫీ కమ్యూనిటీ సభ్యులు షేక్ చిన్ని,కాలేషా,కాశ్మీరావలి,పీరు,ఆషీద్ తదితరులు పాల్గొన్నారు.