
మానసిక వైద్యశాలలో మే 20 సమ్మె పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్: కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసనగా మే 20న దేశవ్యాప్త సమ్మె జరగనున్నది.ఈ నేపథ్యంలో మానసిక వైద్యశాలలో సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ..కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని,సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,రూ.26,000 కనీస వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈఎస్ఐ,పిఎఫ్ అమలు చేసి,కార్మికులకు ఇండిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరారు.కేంద్రం అమలు చేస్తున్న నాలుగు కార్మిక కోడ్లు కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయని,అవి రద్దు చేయాలన్నారు.సమ్మెను ప్రతి ప్రాంతంలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాపర్తి అశోక్,పిట్టల లింగయ్య,ఎన్.సైదయ్య,ఓం ప్రకాష్,శ్రీధర్ లక్ష్మి,బిక్షపతి,ఎస్.లింగయ్య తదితరులు పాల్గొన్నారు.