మామునూరు ఎయిర్పోర్ట్ అనుమతి టిడిపి వల్లనే వచ్చింది.:చాడా మరియ సురేఖ
వరంగల్ జిల్లా ప్రజల రెండు దశాబ్దాల కలలను సాకారం చేసి ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అనుమతులు తీసుకొచ్చిన ఘనత టిడిపి పార్టీదేనని వర్ధన్నపేట టిడిపి ఇన్చార్జ్ చాడా మరియ సురేఖ పేర్కొన్నారు.శుక్రవారం ఆమె వరంగల్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.మామునూరు ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించిందని అన్నారు.టిడిపి కి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి జిఎంఆర్ సంస్థను ఒప్పించి అనుమతులు తీసుకోవడం జరిగిందని వెల్లడించారు.ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినామని కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజేపి పార్టీల నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని మామునూరుకు ఎయిర్పోర్టు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని అన్నారు.