
గ్రామస్థులుకృషి యూత్ క్లబ్ రేపాక. డి ఆధ్వర్యంలో నిరసన
మేము డి.రేపాక గ్రామ ప్రజలము మరియు రైతులము. మా గ్రామం అడ్డగూడూర్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలో గల సర్వే నెంబర్ 165లో ఒక పరిశ్రమ ఏర్పాటు చేయుటకు రైతుల భూములను సేకరించాలనే విషయమై, కొంతమంది రైతులకు ఎమ్మార్వో కార్యాలయం నుండి ఫోన్ ద్వారా ఆర్డీవో గారు పిలిచారని సమాచారం అందింది.అయితే, మా గ్రామంలో ఏ రకమైన పరిశ్రమను (ప్రభుత్వ పరిశ్రమనా? ప్రైవేట్ పరిశ్రమనా? కాలుష్యకారక పరిశ్రమనా?) ఏర్పాటు చేయబోతున్నారో మాకు ఎటువంటి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.కానీ మా గ్రామంలో ఈ చట్టపరమైన ప్రక్రియలను పాటించకుండానే భూసేకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్ల గ్రామ ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.మేము చిన్న, సన్నకారు రైతులమై వ్యవసాయాన్ని ప్రధాన జీవనాధారంగా కొనసాగిస్తున్నాము. మా భూములను పరిశ్రమల కోసం సేకరిస్తే మా జీవనోపాధి దెబ్బతింటుంది. అంతేకాక, కాలుష్యకారక పరిశ్రమలు ఏర్పడితే పర్యావరణం దెబ్బతిని గ్రామ ప్రజల ఆరోగ్యానికి, భవిష్యత్తుకి ముప్పు తలెత్తుతమా గ్రామ భూములను పరిశ్రమల కోసం సేకరించకూడదు.మా గ్రామంలో కాలుష్యకారక పరిశ్రమలు ఏర్పాటు చేయకూడదు.చట్ట ప్రకారం ముందస్తు సమాచారం, ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజల అంగీకారం లేకుండా ఎటువంటి భూసేకరణ జరగరాదు.అని కలెక్టరేట్ ముందు రేపాక రైతులు & గ్రామస్థులుకృషి యూత్ క్లబ్ రేపాక. డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.