
telugu galam news e69news local news daily news today news
పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, జిల్లా నాయకులు కేచ్చేలా రంగా రెడ్డి డిమాండ్ చర్ల మండల కేంద్రంలో ని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా పార్టీ డీవీకే భవన్లో పార్టీ సీనియర్ నాయకులు పాలెం చుక్కయ్య అధ్యక్షతన మండల కమిటీ సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి కేచ్చేలా రంగారెడ్డి పాల్గొని మాట్లాడుతూ మిర్చీ పంటలలో కాలం కలిసి రాక పంటలలో చీడ,పీడ ఎక్కువై పోయి పెట్టుబడులు ఎక్కువ కావడం వలన రైతులు చాలా ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాది రైతు ప్రభుత్వం రైతులను కచ్చితంగా ఆదుకుంటానని ఆయన అంతర్జాతీయ వేదికలలో కూడా రైతుల సమస్యల పట్ల చర్చించడం మంచి విషయమని ఆయన అన్నారు. బహుశా రైతుల ఆత్మహత్యల గురించి వారి సమస్యల గురించి అలాంటి వేదికల మీద ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడటం ఇదే మొట్టమొదటిసారి అని ఆయన తెలిపారు. మిర్చికి కింటాకు 30000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులను అమయకుల్ని చేసి మోసానికి పాల్పడుతున్న దళారులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలని రైతు భరోసా కూడా అందరికీ రాలేదని కొందరికి మాత్రమే అందిందని ప్రభుత్వం ప్రకటించినట్లుగా రైతు భరోసా పైసలు ఈ సమయం లో తక్షణ సాయం గా ప్రతీ రైతుకు అందిస్తే అది రైతుకు వేసంగి పంటలకు పెట్టుబడులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.రైతుల సమస్యలలో భాగంగానే ఈ నెల 26 న ఎస్ కే యం రైతు సంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెం లో చేపట్టనున్న ధర్నాను విజయవంతం చెయ్యాలని మండలాల, డివిజన్ల, జిల్లాల్లోని రైతన్నలకు ,పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలకమిటి సభ్యురాలు సుజాత, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.