
ఈ69న్యూస్ ధర్మసాగర్
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని ఆహ్లాదకరమైన వనంలో ముదిరాజుల సంఘం ఆధ్వర్యంలో వనభోజన విందు ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసపు పవిత్ర వాతావరణంలో, పచ్చని చెట్ల నడుమ, ప్రకృతి ఒడిలో ఈ విందు ఉత్సాహభరితంగా సాగింది.
ఉదయం నుంచే సంఘ సభ్యులు కుటుంబ సమేతంగా వేదికకు చేరుకొని స్నేహపూర్వకంగా పలకరించుకున్నారు. మహిళలు రుచికరమైన వంటకాలను సిద్ధం చేసి అందరికీ వడ్డించారు. పెద్దలు, యువకులు, పిల్లలు అందరూ కలసి పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ, అనుభవాలను పంచుకుంటూ ఆనందంగా గడిపారు.