
ఈ69న్యూస్ ధర్మసాగర్
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో ఎమ్మార్పిఎస్ నాయకులు మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సోంపల్లి అన్వేష్ మాదిగ, సింగాపురం పవన్ చిలక రాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు గొల్లపల్లి అనిల్ మాట్లాడుతూ..షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు అట్టడుగు వర్గాల వారికి చేరడం లేదనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని 30 సంవత్సరాలుగా మొక్కవోని పట్టుదలతో నడిపి వర్గీకరణను సాధించి మాదిగల మన్ననలను పొందడం జరిగిందని అన్నారు. 30 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష నెరవేర్చినందుకు గాను మందకృష్ణ మాదిగ పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఎమ్మార్పీఎస్ నాయకులు చిట్యాల భరత్ కందుకూరి ప్రభాకర్,దయాకర్,నాగులు గొల్లపల్లి రాజేష్,కందుకూరి బాలస్వామి,రవి,అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మాతంగి జైపాల్ తదితరులు పాల్గొన్నారు.