
ఈ69న్యూస్ హన్మకొండ/ధర్మసాగర్
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామంలో,స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యకు వ్యతిరేకంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయన వ్యవహారం ఫారెస్ట్ అధికారులకు అనుకూలంగా,రైతులకు వ్యతిరేకంగా ఉందంటూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.రైతులు పేర్కొన్న విషయాల ప్రకారం,గెజిట్ నోటిఫికేషన్ లేకుండానే ఫారెస్ట్ అధికారులు భూములను ఆక్రమించి,ట్రెంచ్ కోడుతూ రైతులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ధర్మసాగర్,ఎల్కతుర్తి,భీమదేవరపల్లి,వేలెరు మండలాల సరిహద్దుల్లో ఉన్న ఫారెస్ట్ భూములు,అలాగే రైతుల పటా భూములపై వారు సాగు చేస్తున్న ప్రాంతాల్లో,గత కొన్ని దశాబ్దాలుగా అధికారుల వేధింపులు కొనసాగుతున్నాయని చెప్పారు.ఈ వ్యవహారంలో రైతులకు మద్దతుగా నిలవాల్సిన రాజయ్య, రైతుల తరఫున పోరాడకుండా ఫారెస్ట్ అధికారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.అంతేగాక,ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరియు రాజయ్య మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాల వల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు వేదన వ్యక్తం చేశారు.