
telugu galam news e69news local news daily news today news
బుధవారం రోజున ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేయాలని కోరుతూ కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు ఈ కరపత్ర ఆవిష్కరణ ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముంజల బిక్షపతి గౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాజరై మాట్లాడుతూ ఇతర జిల్లాలకు దేవతల పేర్లు పెట్టిన ప్రభుత్వాలు ములుగు జిల్లాకు వనదేవతలైన సమ్మక్క సారక్క నామకరణం ఎందుకు చేయడం లేదు అని ఆయన అన్నారు ఇతర జిల్లాలకు గద్వేల్ కు జోగులాంబ అని సిరిసిల్లకు వేములవాడ రాజన్న ని కొత్తగూడెంకు భద్రాద్రి అని భువనగిరికి యాదాద్రి అని భూపాలపల్లి బొందల గడ్డకు జయశంకర్ సార్ అని ఈ విధంగా దేవతల పేర్లు మహనీయుల పేరు పెట్టిన ప్రభుత్వాలు ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం ఎందుకు చేయలేదు అని వారు అన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఈనెల 23న సమ్మక్క సారక్క సన్నిధికి వస్తున్న సందర్భంగా ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేయాలను కోరుచున్నాము భారత్ జూడో యాత్రలో గత సంవత్సరం ఫిబ్రవరి 6న సమ్మక్క సారక్క సన్నిధి నుండి పాదయాత్ర ప్రారబించబడినది అని ఆయన అన్నారు. అప్పుడు హామీ ఇచ్చినారని ఆయన గుర్తు చేశారు ఇచ్చిన హామీని అమలు పరచాలని ఆయన అన్నారు ఈ సమావేశంలో ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఎరుకల సంఘం రాష్ట్ర నాయకులు ఉపాధ్యక్షులు కేతిరి రాజశేఖర్ లోకిని సమ్మయ్య హనుమకొండ జిల్లా అధ్యక్షులు రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓని సదానందం రంజిత్ ఎరుకల మహిళా సంఘం ములుగు జిల్లా నాయకురాలు ప్రమీల ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది.