మృతుని కుటుంబాన్ని పరామర్శించిన రవి పటేల్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లి గ్రామానికి చెందిన చేపూరి రాజయ్య ఇటీవల మరణించగా, ఆయన 11వ రోజు దశదిన కర్మలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ హాజరయ్యారు.ఈ సందర్భంగా మృతుని కుమారుడు చేపూరి ఓదెలు సహా కుటుంబ సభ్యులను రవి పటేల్ పరామర్శించి, మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ఈ కఠిన సమయంలో పార్టీ తరఫున పూర్తి స్థాయిలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రేపాకపల్లి గ్రామ టీఆర్పి కమిటీ అధ్యక్షుడు రమేష్, గ్రామ కమిటీ నాయకులు పాల్గొని మృతుని కుటుంబానికి ధైర్యం చెప్పారు. సామాజిక బాధ్యతతో ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ పార్టీ నాయకులు ముందుకు సాగుతున్నారని వారు పేర్కొన్నారు