
మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన..కోదాడ మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పార్టీ కార్యకర్తలకు, సానుభూతిపరులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని కోదాడ మాజీ శాసన సభ్యురాలు నలమాద ఉత్తం పద్మావతి రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని రత్నవరం గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన సోమ భారతమ్మ, కాసాని కాశయ్య గౌడ్, దార్ల పెంటయ్య, కందాల బుచ్చిరెడ్డి ల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాల లేసి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల గాయపడిన జొన్నలగడ్డ చందు ను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట గ్రామ సర్పంచ్ పగడాల పద్మా ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ మొలుగూరి ఉపేందర్, మాజీ సర్పంచులు రామిని విజయవర్ధన్ రెడ్డి, పసుపులేటి వినయ్ వర్ధన్ బాబు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సోమగాని రవి, గ్రామస్తులు విఎల్ఎన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు