
కల్లూరి మల్లేశం సిఐటియు జిల్లా కార్యదర్శి
— కల్లూరి మల్లేశం సిఐటియు జిల్లా కార్యదర్శి
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా , లేబర్ కోడ్ ల రద్దు కోరుతూ జాతీయ , రాష్ట్ర కార్మిక సంఘాలు , స్వతంత్ర ఫెడరేషన్ లు ఇచ్చిన పిలుపు మేరకు మే 20 న జరిగే దేశవ్యాపిత సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు.
సోమవారం రోజున కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి, మిషన్ భగీరథ యూనియన్ ఆధ్వర్యంలో SE కార్యాలయంలో , మేఘా కంపెనీ ఆఫీస్ లో,ట్రాన్స్ పోర్ట్ యూనియన్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్(DTO ) కి సమ్మె నోటీస్ లు అందించడం జరిగింది.సమ్మె నోటీస్ లకు ముందు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నుండి బిజెపి ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చారని ఈ లేబర్ కోడ్ ల ద్వారా కార్మికుల 8 గంటల పనిని 12 గంటలకు పొడిగించి కార్మికులపై పని భారం పెంచుతున్నారని విమర్శించారు.
భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు , కార్మిక హక్కులను కాపాడుకునేందుకు జాతీయ కార్మిక సంఘాలు ,స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు కలిసి మే 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని జిల్లాలోసంఘటిత ,అసంఘటిత,ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు ,ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటి సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం ,మిషన్ భగీరథ యూనియన్ జిల్లా అధ్యక్షులు సి హెచ్ శ్రీను , జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్ ,ట్రాన్స్ పోర్ట్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ డి ఉమర్,PNM జిల్లా అధ్యక్షులు గంటెపాక శివ ,కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రేఖ , వివిధ రంగాల నాయకులు కర్ణాకర్ ,వెంకటేష్ , మహేష్ , వసంత , లక్ష్మి , మమత , వాల్య తదితరులు పాల్గొన్నారు