మైనారిటీగురుకులంలో అడ్మిషన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే
సత్తుపల్లి పట్టణంలోని గుడిపాడు రోడ్లో గల తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనది. అడ్మిషన్లు 2026- 27 విద్యా సంవత్సరానికి గాను ఐదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ మరియు బైపీసీ ఇంగ్లీష్ మీడియం విద్యార్ధులకు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దంపతులుహాజరైనారు.కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మరియు క్రిస్టియన్ మైనారిటీ పేద వర్గాల వారిని దృష్టిలో ఉంచుకొని వారి అభ్యున్నతి కొరకు మైనారిటీ గురుకులపాఠశాలలనుఅంకితభావంతోనడిపిస్తుంది అనితెలిపారు.అందుకనిఈసొసైటీలో విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లరూపాయలుఖర్చుచేస్తుందనితెలిపారు.ఈ అవకాశాన్ని మైనారిటీలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా ఈ సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల నిరంతరసేవప్రశంసనీయమైనదని తెలిపారు.దానికితార్కాణం విద్యార్థుల ప్రతిభే అని దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన స్కూల్ మరియు కాలేజీ ప్రిన్సిపాల్ కత్తి వెంకటరామయ్య అని తెలిపి ప్రత్యేకంగా ఆయనను అభినందించారు. అలాగే మన సత్తుపల్లి లో ఉన్న ఈ మైనారిటీ గురుకులంలో ప్రతిపేద మైనారిటీవిద్యార్థులుఅడ్మిషన్లుతీసుకోవాలన్నారు.అలాగే నేటి రోజుల్లో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు ఆకాశం వైపు చూస్తున్నాయనిఅయినాప్రభుత్వం ఎన్నో సౌకర్యాలుకల్పిస్తున్నప్పుడు వాటిని సద్వినియోగంచేసుకోవాలని హితవు పలికారు.అలాగే తాను చదివే రోజుల్లో ఇన్ని సౌకర్యాలు లేవన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన విశిష్ట అతిథి ఖమ్మం జిల్లా మైనారిటీ విద్యాసంస్థల ప్రాంతీయ సమన్వయ అధికారిణి అరుణకుమారి 2026- 27 అడ్మిషన్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్ ఎల్ సి మాట్లాడుతూ దేశంలోనే తలమానికంగా మన గురుకులాలు ఉన్నాయని చరిత్ర తెలుపుతుందని అందుకు ఉదాహరణగా బీహార్ లోని నలంద విశ్వవిద్యాలయం అని, ఎంతో మంది విదేశీయులు అక్కడ చదువుకొని గొప్పవారిగా రాణించారని ఆ స్పూర్తితోనే మన రాష్ట్రంలో గురుకులాల వ్యవస్థ ఏర్పాటు చేయబడిందని వాటిని సద్వినియోగ పరుచుకోవాలని ప్రతి ఒక్క పేద ముస్లిం విద్యార్థి చదువుకొని వారి భవిష్యత్తుకు రాచబాట వేసుకోవాలని తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు వసతి భోజనం, పుస్తకాలు, బట్టలు మొదలైన సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తుందని తెలిపారు. తమ విద్యార్థులకు ప్రపంచాన్ని పరిచయం చేసే ఇంగ్లీష్ మీడియంలోనే విద్యా బోధన ఉంటుందని తెలిపారు. అలాగే విద్యార్థుల ప్రగతికి అనునిత్యం కృషి చేస్తున్న ప్రిన్సిపాల్ కే.వెంకట్రామయ్యని అభినందించారు. ఇంకాఈకార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ కె.వెంకటరామయ్య మాట్లాడుతూ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా తమ అభ్యర్థనను మన్నించి కార్యక్రమానికి విచ్చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో దేనిమీదైనా పట్టు సాధించాలంటే అది కేవలం చదువుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలిపి, నిరక్షరాస్యుడైన కుచేలుడు ప్రపంచాన్ని చుట్టి రావాలంటే కేవలం చదువుకుంటేనే సాధ్యమవుతుందని తెలిపారు. అందుకని జ్ఞానాన్ని ,తెలివినిమేల్కొల్పేది చదువేననితెలిపారు.అందుకనిమహాకవి కాళోజీ అన్నట్లు ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళ కలయిక అని తెలిపారు అన్నారు.అలాగే ఖమ్మం ఆర్ఎల్ సి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా కార్యక్రమంలో విజిలెన్స్ అధికారి కె. సీతారాములు, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, విఎంసి జి.చెన్నారావు, మైనారిటీ రిలీజియన్ పెద్దలు షేక్ నాయబ్ రసూల్,ఎండి కమల్ పాషా, ఎస్ ఐ ఓ సత్తుపల్లి ముజీబుర్రహ్మాన్, హిందీ పండిట్ కిష్టారం ఎండి రియాజ్,సి సి ఓ లక్మోజీ ఎస్సీఓవై.శేషగిరి ,దొడ్డాకుల గోపాల్ రావు,పువ్వాళ్ళ ఉమా ఇతర ఉపాధ్యాయులు, ఇమాములు, సదర్లు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.