
మైనార్టీలకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం
మైనార్టీల సంక్షేమానికి బిఆర్.ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని కోదాడ
శాసనసభ్యులు బొల్లంమల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం నడిగూడెం మండల పరిధిలోని వల్లాపురంలో ఉర్దూ పాఠశాలను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…… తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ముస్లింల జీవితాలు దుర్భరంగా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింల స్థితిగతుల్లో అన్యుహమైన మార్పులు తెచ్చారన్నారు విద్యాపరంగా వెనుకబడి ఉన్న ముస్లింలకు మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నేడు వేలాది మంది విద్యార్థులకు వసతులతో కూడిన కార్పొరేట్ విద్యను అందిస్తున్నారు చదువుకు దూరంగా ఉన్న ముస్లిం బాలికలు నేడు ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత లక్ష్యాలు సాధిస్తున్నారు అన్నారు. మతతత్వ పార్టీలు సెక్యులరిజానికి గండి కొడుతున్నాయి అన్నారు ఆసక్తులు బలోపేతం అయితే దేశానికి పెద్ద ప్రమాదం అన్నారు ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రం తో పాటు దేశంలోని అన్ని వర్గాలను కాపాడుకునేందుకు బిఆర్ఎస్ పార్టీని స్థాపించి మతతత్వ శక్తులకు దీటుగా పోరాడుతున్నారన్నారు మైనార్టీలంతా సీఎం కేసీఆర్ వెంట నడవాలి అన్నారు గత పాలకవర్గాలు ముస్లింలను ఓటు బ్యాంకు గాని చూశాయని వారి సామాజిక అభివృద్ధికి చేసింది ఏమీ లేదు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శిథిలావస్థలో ఉన్న మసీదులకు ఈద్గలకు కబరిస్తాన్లకు నిధులు కేటాయించి అభివృద్ధి చేసిందన్నారు ముస్లింల ఆత్మగౌరవానికి అండగా నిలబడుతుందన్నారు రంజాన్ పండుగ సందర్భంగా పండగ ఘనంగా జరుపుకునేందుకు రంజాన్ కానుకలు ఇఫ్తార్ విందులు ఇచ్చి ముస్లింలకు ప్రభుత్వం భరోసా ఇచ్చిందన్నారు. మసీదుల్లో పనిచేస్తే మౌజన్ లకు ఇమామ్ లకు గౌరవ వేతనాలు ఇస్తూ వారికి ఉపాధిని కల్పించామన్నారు. ప్రత్యేకమైన సంక్షేమ పథకాలతో పాటు సామాజికంగా అందించే అన్ని సంక్షేమ పథకాలు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పింఛన్లు రైతుబంధు రైతు బీమా సబ్సిడీ రుణాలు అందిస్తూ మైనార్టీలకు అన్ని విధాలుగా ప్రభుత్వం ఆసరా కల్పిస్తుందన్నారు మైనార్టీ రిజర్వేషన్లను కూడా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మైనార్టీలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యాతాకుల జ్యోతిపతి మధుబాబు, సర్పంచి చంద్రయ్య, మైనార్టీ నాయకులు ఆల్తాఫ్ హుస్సేన్,ఇస్రార్, షఫీ, జానీ, మహమ్మద్, మత పెద్దలు, ఇమామ్ లు, మౌజాన్లు, టిఆర్ఎస్ నాయకులు ఈదయ, శీను తదితరులు పాల్గొన్నారు.