
telugu galam news e69news local news daily news today news
పట్టణంలో చోరీలకు పాల్పడి మోటార్ సైకిల్ల్లు మరియు వెండి నగల దొంగ ను అరెస్ట్ చేయడం జరిగింది.రెండు మోటార్ ల సైకిల్లు మరియు 30 తులాల వెండి పట్టీలు మరియు 1 గ్రాము గోల్డ్ రింగ్ రికవరీ.భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు,భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా భద్రాచలం పట్టణానికి చెందిన షేక్ ధారుక్ బాబా అలియాస్ చోటు పోలీసులను చూసి పారిపోవుట ప్రయత్నిస్తుండగా అనుమానంవచ్చి అతన్ని పట్టుకొని తనదైన శైలి లో విచారించగా, భద్రాచలం పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ లోని మరియు మెడికల్ కాలనీలో నిలిపి ఉంచిన రెండు మోటార్ సైకిల్ లను మరియు 30 తులాల వెండి పట్టీలు, 1 గ్రాము గోల్డ్ రింగ్ దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నాడు. దొంగతనానికి పాల్పడిన షేక్ ధారుక్ బాబా చోటు అను వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించడం జరిగింది.