మోడీ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను ఓడించాలి
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ కు నవంబర్ 26న కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా తెలంగాణ రైతు సంఘం సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా పోత్కనూరి ఉపేందర్ అధ్యక్షత వహించిన
తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ మాట్లాడుతూ….దేశంలో కార్మిక కర్షక మైత్రితో కేంద్రంలోని బీజేపీ మోడీ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను ఓడించాల్సిన అవసరం ఉందని దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నదని కార్మిక కర్షక వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలు వెనక్కి తీసుకోవాలని తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని నవంబర్ 26వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు.ఈ సందర్భంగా భూక్యా చందు నాయక్ మాట్లాడుతూ…అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 9.12, 2021న రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలి.వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి విలువ జోడింపు ద్వారా వచ్చిన మిగులును రైతులకు పంచాలి.కనీస మద్దతు ధరల చట్టం (సి2+50) కొనుగోలుకు గ్యారెంటీ చేస్తూ చేయాలి.వెంటనే ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోని అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి.వరి సేకరణపై తేమ పరిమితిని 17 శాతం నుండి 22శాతానికి పెంచాలి.రైతులు,వ్యవసాయ కార్మికులకు సమగ్ర రుణమాఫీ పథకాన్ని ప్రకటించాలి.మైక్రో ఫైనాన్స్ దోపిడీని నియంత్రించాలి.వడ్డీ రేటును నియంత్రించాలి.రుణగ్రహీతలను వేధించడంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.రైతులకు వడ్డీ లేని రుణ పథకాన్ని అమలు చేయడానికి ఆర్బిఐ మిగులును నాబార్డ్కి బదిలీ చేయాలి.విద్యుత్,ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయొద్దు.స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు.విద్యుత్ బిల్లు-2025ను రద్దు చేయాలి.గృహవినియోగ దారులందరికి నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలి.భారతదేశంపై అమెరికా 50 శాతం సుంకాలు విధించడాన్ని ఎదుర్కోవాలి.పత్తి,పాడి పరిశ్రమ రంగాలలో స్వేచ్ఛా వాణిజ్యం వద్దు.పత్తిపై 11% దిగుమతి సుంకాన్ని రద్దు చేసిన నోటిఫికేషన్ ను ఉపసంహరించాలి.ఇండో-బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలి.రైతులు,కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలి.భారతదేశంలో సాధారణ పంటల సమయంలో పంట ధరలను తగ్గించే అన్ని వ్యవసాయ పంటల దిగుమతులను నిషేధించాలి.తీవ్రమైన వరదలు,ప్రకృతి వైపరీత్యాలను జాతీయ విపత్తులుగా ప్రకటించాలి.వరద పరిస్థితికి కారణాలు,పర్యావరణ ప్రభావ అధ్యయనం లేకుండా సున్నితమైన హిమాలయ ప్రాంతాలలో సహజ వనరులను కార్పొరేట్లు స్వాధీనం చేసుకోవడం వల్ల కలిగే ప్రభావంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలి.పంజాబ్లో మరణించిన కుటుంబాలకు జీవనోపాధికి,బాధితుల సామాజిక,ఆర్థిక జీవితాన్ని పునర్నిర్మించడానికి రూ.25,000 కోట్లతో సహా అన్ని విపత్తు ప్రభావిత రాష్ట్రాలకు రూ.1 లక్ష కోట్ల పరిహారం ఇవ్వాలి.కౌలు రైతులు,వ్యవసాయ కార్మికులకు పరిహారం ఇవ్వాలి.నష్టాలను అంచనా వేయడానికి,నిజమైన లబ్దిదారులకు పరిహారం అందడానికి భౌతిక సర్వే చేయించాలి.ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలి.ఈ పథకం ద్వారా 200 రోజుల పని,రోజు కూలీ రూ.700 ఉండేలా చర్యలు తీసుకోవాలి.నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి.క్యాజువల్,ఔట్సోర్సింగ్,కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలి.నియామకాలపై నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలి.ప్రభుత్వ, ప్రభుత్వ రంగం సంస్థలలో ఖాళీగా ఉన్న 65 లక్షల పోస్టులను భర్తీ చేయాలి.పాత పెన్షన్ పథకాన్ని పునరుద్దరించాలి.రిజర్వేషన్లను కాపాడటానికి ప్రైవేటీకరణను ఆపాలి.ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలకుసామాజిక రిజర్వేషన్లను పటిష్టంగా అమలు చేయాలి.వ్యవసాయ భూమినివిచక్షణారహితంగా సేకరించడాన్ని ఆపాలి.పునరావాసం కోసం ప్రజల హక్కులను గౌరవించాలి.బుల్డోజర్ రాజ్ వద్దు,నిరంకుష అధికార యంత్రాంగంపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ బాధితులందరికీ గ్రామీణ ప్రాంతాల్లో 4 రెట్లు,పట్టణ ప్రాంతాల్లో 2 రెట్లు పరిహారం ఇవ్వాలి.నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి.కనీస వేతనాల హక్కును రక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకులు మంగ బీరయ్య రమావత్ మీట్యా నాయక్ తాండ్ర ఆనందం గురజాల లక్ష్మీనరసింహారెడ్డి బైరగోని మల్లేష్ కర్రె సత్తయ్య,బోడ రాములు బొట్టు సూరి హల్ల్య సిద్ధమ పాలమాకుల
పాలమాకుల ఎల్లేష్
పాలముకుల అపర్ణ.పాలమాకుల నరేందర్
గంపల బాబు
పాలమాకుల మానిక యాదగిరి
పోలబోయిన కనుకయ్య
పోలబోయిన రాములు
చీటూరి భవాని
పాలమాకుల చంద్రకళ
పాలమాకుల.నమేష్
పాలమాకులా.నర్సింహులు
మానిక పరమేష్
చీటూరి కవిత
పాలమాకుల సాహితి తదితరులు పాల్గొన్నారు.