మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా కీర్తి శ్రీధర్
చిల్పూర్ మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలో నిర్వహిస్తున్న చిన్నపెండ్యాల ప్రీమియర్ లీగ్-2026 క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా కొనసాగుతోంది.42 జట్లతో ప్రారంభమైన ఈ లీగ్‌లో నిన్న క్వార్టర్ ఫైనల్స్ నిర్వహించగా,8 జట్ల మధ్య జరిగిన పోటీల్లో 4 జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి.బుధవారం రోజు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో రైసింగ్ స్టార్స్ ఆఫ్ చిన్నపెండ్యాల జట్టు(115/4)స్కోరు చేయగా,ఆల్ ఇస్ వెల్ జట్టు (98/6) లక్ష్యాన్ని చేధించలేక 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన కీర్తి శ్రీధర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించిందని ఆర్గనైజర్లు తాళ్లపల్లి క్రాంతి కుమార్,పేరాల రాకేష్,పూజారి రమణ తెలిపారు.ఈ సందర్భంగా కీర్తి శ్రీధర్ మాట్లాడుతూ..మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో క్రీడాకారులు,గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.