
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు విధానాలు ఉపసoహరిoచుకోవాలని ఈనెల 20న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె సంబంధించిన యాచారం మండల కేంద్రంలో సిఐటియు కార్యాలయంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం చంద్రమోహన్ గారు హాజరై మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను మరియు కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలను మరింత దూకుడు అమలు చేస్తుందని అన్నారు. కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాలు సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, వాట్ ఇస్ స్థానంలో 4 లేబర్ కోడ్ లను ముందుకు తీసుకొచ్చిందని అన్నారు. 2025-2026 బడ్జెట్లో తమ కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుకూలంగా కేటాయింపులు చేసిందన్నారు. సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టింది అన్నారు. ఉపాధి నిరుద్యోగం అధిక ధరలు ఆకలి అసమనాథలు ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను పట్టించుకోకపోగా ఈ సమస్యలను మరింత తీవ్ర రూపంలో దాల్చే ఆర్థిక విధానాలకు విచక్షణారహితంగా అమలు చేస్తుందని అన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి కొట్టేందుకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్ లు, అసోసియేషన్లు 2025 మే 20న దేశభ్ర సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించే అన్నారు. ఈ సార్వత్రిక సమ్మె సంయుక్త కిసాన్ మోర్చా SKM సంపూర్ణ మద్దతు ప్రకటించిందని అన్నారు. సమ్మె రోజున గ్రామీణ బందుకు SKM ఇప్పుడు పిలుపునిచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక వర్గం మే 20న జరిగే సమ్మెను సమాయత్తo కావాలని ,సంఘటిత, అసంఘటిత కార్మికులు ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు ఉద్యోగులందరూ ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.
కేంద్రంలోని బిజెపి అని సరిస్తున్న ఆర్థిక విధానాల లను 5 శాతం ఉన్న పెట్టుబడిదారుల వద్ద 70 శాతం ఆదాయం పోగుపడగా, 50% ప్రజల వద్ద కేవలం 3 శాతం మాత్రమే ఉండి రోజు గడవడమే కష్టంగా మారిందని అన్నారు. పేదరికం 17% నీకి పెరిగిందన్నారు. పెరిగిన ద్రవ్యోల్బణం పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలు కార్మిక పేద ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 78 సంవత్సరాలు తర్వాత కూడా కల్పించిన ప్రాథమిక హక్కులను నేడు ముప్పు వాటిల్లిందని అన్నారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం 4 లేబర్ కోడ్ లను అమల్లోకి తెస్తున్నారనీ అన్నారు. 12 గంటల పనిని చట్టబద్ధం చేస్తున్నారని అన్నారు సామాజిక భద్రత పథకాలను నిధులు తగ్గిస్తుందని అన్నారు. కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్‌ను కఠినతరం చేసి కార్మిక సంఘాలను రద్దు చేసేందుకు కూడా బరిలతెగించేసిందని అన్నారు. పని స్థలాల వద్ద గేటు మీటింగ్‌లు కరపత్రాలు పంపిణీ వంటి వాటిని సైతం నిషేధించడం ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కులన్నిటిని తుంగలోకి తొక్కుతుందన్నారు. చట్టాలు అమలు చేయని యజమాన్యాలకు శిక్షలు తగ్గించడం కార్మిక శాఖ ను పూర్తిగా ఫెసిలిటేట్ విభాగం మార్చడం స్కీమ్ వర్కర్స్ ను కార్మికులుగా గుర్తించకుండా పెట్టి చాకిరి చేసే విధంగా లేబర్ కోడ్ లు రూపొందించారని అన్నారు. ఈచ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మికుల సమ్మెకు నిర్వీర్యం చేస్తూ సమ్మెలేని పరిస్థితిలను ఈ కోడ్ ల ద్వారా కల్పించి కార్మికులను తిరిగి బానిసత్వం లోకి నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందుకే నాలుగు లేబర్ కోడ్ లను తిప్పి కొట్టి కార్మిక చట్టాలను కాపాడుకోవడం కార్మిక వర్గానికి చాలా అవసరమని అన్నారు. ఈపీఎస్, పిఎఫ్,EDLIS లకు యజమానులు సకాలంలో చెల్లించకపోతే గతంలో ఉన్న 25 శాతం ఫీనల్ వడ్డీని ఒకటి శాతం తగ్గించి యజమానులను మరింత డిప్లాటర్ గా మారుస్తున్నారని అన్నారు. EPFO కు తెలంగాణ రీజియన్ లో రూ.2800 ఓట్లు యజమాను లు బాకీ పడటం అన్యాయం ప్రభుత్వ విద్య వైద్యం గ్రామీణ ఉపాధి హామీ ఐ సి డి ఎస్ పథకాలకు వార్షిక బడ్జెట్లో కోత పెట్టారని అన్నారు. గత పది సంవత్సరాల కాలంలో రూ.16,35,000 కోట్లు కార్పొరేట్ల పన్ను మాటి రూపంలో లబ్ధి చేర్చుకున్నారని అన్నారు.
నేపథ్యంలో 2025 మే 20న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో యాచారం మండలంలోని అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వై స్వప్న, పెండ్యాల బ్రహ్మయ్య, సిఐటియు మండల కన్వీనర్ చందు నాయక్, సిఐటియు మండల నాయకులు బి కృష్ణ, కే నరేందర్, టి రాములు, జంగయ్య, నరేందర్, శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు