వరంగల్ నగరంలో యువత మత్తు పదార్థాల బారిన పడుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గంజాయి-డ్రగ్స్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ డిమాండ్ చేశారు.మంగళవారం ఆయన వరంగల్ ఎసిపికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ..గంజాయిని కుక్కటివేళ్లతో పెకిలించాలి”అని పేర్కొంటూ,యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ మత్తు పదార్థాల వ్యాప్తిని పూర్తిగా అరికట్టాలని కోరారు.దేశ సంపదైన యువతను పెడదారి పట్టిస్తున్న గంజాయి మహమ్మారిని ఆపాల్సిన బాధ్యత సమాజం మీద ఉందన్నారు.స్కూల్,కాలేజీ విద్యార్థులకు మత్తు పదార్థాలు దూరం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని,తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గంజాయి మత్తులో ఎంజాయ్ చేయొద్దు జీవితాన్ని నరకం చేసుకోవొద్దు”అని యువతకు హితవు పలికారు.మత్తు పదార్థాల కారణంగా చాలా మంది యువకులు ఆరోగ్యపరంగా,ఆర్థికపరంగా దెబ్బతింటున్నారని,కొంతమంది కుటుంబ సభ్యులను కూడా గుర్తించలేని స్థితికి చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.త్వరగా డబ్బు సంపాదించాలనే వాంఛతో కొంతమంది యువత తప్పు దారులు ఎంచుకొని క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు.గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుని సరఫరాను అడ్డుకోవాలని పోలీసులు పునరుద్ఘాటించారు.వరంగల్ ఎసిపి స్పందిస్తూ ఈ నేపధ్యంలో త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మార్థనేని ధర్మారావు,మాజీ మేయర్ డా.టి.రాజేశ్వరరావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ షా,వన్నాల వెంకటరమణ,బీజేపీ సీనియర్ నాయకులు సముద్రాల పరమేశ్వర్,జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్,జిల్లా ఉపాధ్యక్షులు గడల కుమార్,జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పోలేపాక మార్టిన్ లూథర్ పాల్గొన్నారు.