కొత్త వెంకటగిరిలో అహ్మదీయ ముస్లిం సంఘం శాఖల వార్షిక సమావేశాలు

ఈ69 న్యూస్,ఖమ్మం
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కొత్త వెంకటగిరి గ్రామంలో అహ్మదీయ ముస్లిం సంఘం ఆధ్వర్యంలో మజ్లిస్ అన్సారుల్లాహ్,మజ్లిస్ ఖుద్దాముల్ అహ్మదీయ మరియు అత్ఫాలుల్ అహ్మదీయ (వయోజనులు,యువకులు,బాలురు) వార్షిక సమావేశాలు ఘనంగా నిర్వహించారు.ఈ సమావేశాలకు ఖమ్మం,నల్గొండ జిల్లాలకు చెందిన పలు గ్రామాల నుండి సభ్యులు హాజరయ్యారు.సభ్యుల మానసిక ఉల్లాసం కోసం వివిధ విద్యా మరియు క్రీడా పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా వయోజనుల అధ్యక్షుడు షేఖ్ మహబూబ్ మాట్లాడుతూ..“అన్సారుల్లాహ్ అంటే దైవ సహాయకులు.వారు రాబోయే తరాలకు ఆధ్యాత్మిక స్ఫూర్తిగా నిలవాలి”అని పిలుపునిచ్చారు.యువకుల అధ్యక్షుడు మాట్లాడుతూ..“యువత సంస్కరణ లేక సమాజ సంస్కరణ సాధ్యం కాదు.అందుకే యువత ధార్మికంగా ఎదిగి సేవా కార్యక్రమాల్లో చురుకుగా ఉండాలి”అని ప్రబోధించారు.జిల్లా ఇన్చార్జి ముహమ్మద్ అక్బర్ మాట్లాడుతూ..“చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.సామాజిక మాధ్యమాలను మంచి విషయాలకు మాత్రమే ఉపయోగించాలి”అని సూచించారు.చివరగా జిల్లా అధ్యక్షుడు షేఖ్ హుస్సేన్ మాట్లాడుతూ..జీవిత సాఫల్యం కోసం అల్లాహ్తో దృఢమైన సంబంధం ఏర్పరుచుకోవాలి.ప్రవక్త (స.అ.వ) బోధనల ప్రకారం నడుచుకుంటూ ఖిలాఫత్తో అనుసంధానమై ఉండాలి”అని ప్రబోధించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు,ఖమ్మం సదర్,వివిధ గ్రామాల యువకులు,వయోజనులు,బాలురు,జమాఅత్ అధ్యక్షులు,మోల్వీలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.