యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌పై కేసు నమోదు చేయాలి
హనుమకొండ జిల్లా స్వేరో స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ..గురువారం హనుమకొండలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లోని వైఫల్యాలను ప్రశ్నించారన్న కారణంతో,యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపించారు.ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను వ్యక్తిగతంగా అవమానించే రీతిలో “గుండు మీద బొచ్చు లేదు.గుండులోపల మెదడు లేదు”వంటి దిగజారిన పదజాలాన్ని ఉపయోగించడం వల్ల,తెలంగాణలోని స్వేరోస్,అభిమానులు,విద్యార్థుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు.ఈ నేపథ్యంలో తోట పవన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ హనుమకొండ ఎస్హెచ్ఓ ఇన్చార్జ్ ఎస్ఐ సతీష్‌కు పిటిషన్ సమర్పించినట్టు ఎల్తూరి సాయికుమార్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యక్షుడు చెట్టుపల్లి శివకుమార్,ఒకేషనల్ కాలేజ్ నాయకులు రణధీర్,చరణ్,వినయ్ తదితరులు పాల్గొన్నారు.