
స్సీ డిక్లరేషన్ లో రజకుల స్థానం ఏంటో ప్రకటించాలి _
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి వైపున ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్న సందర్భంలో భాగంగా ఈరోజు
7-11-2023 మంగళవారం భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు బీసీ డిక్లరేషన్ చేయడానికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీసీ డిక్లరేషన్ సభకు విచ్చేస్తున్నారు.తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర కోశాధికారి ఓరుగంటి వెంకటయ్య వెళ్ళడం జరిగింది. గతంలో బిజెపి 2018 మేనిఫెస్టోలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని హామీ ఇవ్వడం జరిగింది. రజకులు 18 రాష్ట్రాల్లో మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్సీ జాబితాలో ఉన్న విషయాన్ని
బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సాలి గారిని కలిసి చర్చించడం జరిగింది.
మన భారత ప్రధాని 11 నవంబర్ 2023 పరేడ్ గ్రౌండ్లో మాదిగ విశ్వరూప సభకు విచ్చేస్తున్నారు .భారతదేశం ఎదురుచూస్తున్న ఎస్సీ వర్గీకరణ ప్రకటించనున్నారని తెలుస్తుంది కావున రజక కులస్తులను కూడా చేర్చే విషయాన్ని మరియు పార్లమెంటులో బిల్లు పెట్టే సమయంలో 11 రాష్ట్రాల రజకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్ గురించి ఈరోజు చర్చించడానికి మీటింగు వెళ్ళడం జరిగింది. ఈనెల 11వ తేదీన ప్రధానమంత్రి ప్రకటించే ఎస్సీ డిక్లరేషన్ తర్వాత తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర కమిటీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నది.