
14/ డిసెంబర్ 2022 రోజున రజక వృత్తిదారుల సంఘం ప్రధమ మహాసభను జయప్రదం చేయగలరని కల్లేపల్లి బాబు అధ్యక్షతన రాంనగర్ ప్రైవేట్ భవనంలో కరపత్రం ఆవిష్కరణ కంచర్ల కుమారస్వామి చేయడం జరిగింది మన రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు మన సమస్యలపై ఎన్నో పోరాటలు నిర్వహించింది ఫలితాలు విజయాలు సాధించి అందులో భాగంగానే రజకులకు ఇస్త్రీ చేసే వారికి ఉచిత విద్యుత్ పథకం దానికి గాను జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రభుత్వానికి ఒప్పించిన ఉచిత విద్యుత్ 250 యూనిట్ సాధించింది ఈ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 72,000 మంది లబ్ధి పొందుతున్నారు హనుమకొండ జిల్లాలో 2300 మంది లబ్ధి పొందుతున్నారు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ప్రభుత్వ అధికారికంగా నిర్వహించే విధంగా సాధించము రజక వృత్తిదారుల సంఘం మురికి నీరులో బట్టలు ఉతకడం జరుగుతుందని దానికి ప్రత్యయముగా అధునాతన లాండ్రీలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడంలో ప్రభుత్వం 8 చోట్ల 10 జిల్లాల్లో ఏర్పాటు చేశారు అన్ని పట్టణాలలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పై సంఘం ఒత్తిడి చేస్తుంది రజక వృత్తిదారుల రజక ఫెడరేషన్ ద్వారా 190 జీవో ప్రకారం 3700 మందికి 50 వేల రుణాలు ఇప్పించడం జరిగింది ఉచిత విద్యుత్ పథకం కింద విద్యుత్ బకాయిలు 12.88 కోట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు గారిని కలిసి విడుదల చేయించడం జరిగింది .అనేక జిల్లాలో రజక వృత్తిదారుల పై జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపులు సామాజిక దాడులు వ్యతిరేకంగా పోరాటం చేసే రజక వృత్తిదారుల సంఘం రక్షణ విజయాలను ఇంకా సాధించాల్సిన సమస్యలు అనేకంగా ఉన్నాయి కావున మనందరం ఐక్యంగా ఉండి మన రజక హక్కులను సాధన కొరకు మన జిల్లాలో జరిగే రజక వృత్తిదారుల సంఘం మహాసభను జయప్రదం చేయాలని కోరుతున్నాం పాల్గొన్నవారూ సమన్వయ కమిటీ సభ్యుడైన గొడుగు వెంకట్ గారు అదేవిధంగా కోకోనర్ మాండ్రాజు రమాదేవి జిల్లా కమిటీ సభ్యులుచిట్యాల మహేష్ కృష్ణ శ్రీమాతా స్వప్న భాగ్య తదితరులు పాల్గొన్నారు