
కార్పొరేషన్, ఫెడరేషన్ లకు నామమాత్రం గా బడ్జెట్ కేటాయింపులుకే.లింగయ్య *జిల్లా కన్వీనర్
ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో.బీసీ సంక్షేమానికి 6229 కోట్ల రూపాయలు కేటాయించారు. గతంతో పోలిస్తే 551 కోట్లు పెరిగినట్టు కనిపిస్తుంది.
విద్యార్థుల స్కాలర్షిప్ లు, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర చదువుల కోసం ఖర్చు చేస్తారు.
వీటిలోనే కార్పొరేషన్ ఫెడరేషన్ కి
కేటాయించారు కానీ నయా పైసా విడుదల చేయలేదు. రజకులకు, నాయి బ్రాహ్మణులకు కేటాయించినవి విద్యుత్ సబ్సిడీ కింద తీసుకున్నారు.
చేతి వృత్తులు చేస్తూ జీవనం గడుపుతున్న వారికి ఉపాధి కల్పించడానికి, వృత్తిలో ఆధునీకరణ పద్ధతుల ద్వారా ఆదాయం పెంచే విధంగా కృషి చేయాల్సిన కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023 – 24 బడ్జెట్ లో నామ మాత్రమే 158 కోట్ల20 లక్షలు, ఎంబీసీలకు 300 కోట్లు కేటాయించి వృత్తిదారులను నిరాశపరిచింది.
కల్లుగీత , రజక,నాయి బ్రాహ్మణ,
వడ్డెర, విశ్వ బ్రాహ్మణ, పూసల, బట్రాజ్,
ఉప్పర, బోయ, కుమ్మరి, మేదర
కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు 10 వేల కోట్లు కేటాయించాలి. తద్వారా వీరి అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం.